త్వరలో వెలైకరన్ సెకండ్ పోస్టర్ రిలీజ్
ఇటీవల తమిళ సినీ పరిశ్రమలో అగ్రహీరోలు విజయ్, అజిత్ సినిమాలకు శివకార్తికేయన్ నటించిన సినిమాలు గట్టిపోటీనిచ్చాయి.
ఇటీవల తమిళ సినీ పరిశ్రమలో అగ్రహీరోలు విజయ్, అజిత్ సినిమాలకు శివకార్తికేయన్ నటించిన సినిమాలు గట్టిపోటీనిచ్చాయి.
ఈ డాషింగ్ హీరో శివకార్తికేయన్ చిత్రం వెలైకరన్‌కు భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ సినిమా బడ్జెట్ విషయంలో రాజీపడబోమని ప్రకటించారు నిర్మాతలు. అంతేకాదు అందరి అంచనాలకు అనుగుణంగానే ఈ సినిమా ఉంటుందని ప్రకటించారు.
వెలైకరణ్ కుటుంబకథవినోధభరిత చిత్రంగా యూనిట్ వర్గాలు చెప్పాయి. ఈ సినిమాకు మోహన్‌రాజా దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది.
శివకార్తికేయన్, నయనతార జంటగా మరో బ్లాక్‌స్టర్ చిత్రంగా ఈ సినిమా ఉండే అవకాశం ఉందని యూనిట్ వర్గాలు ప్రకటించాయి.
ఫహద్ ఫాసిల్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆగష్టు 8వ, తేదిన వెలైకరణ్ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు. ఆ రోజు సాయంత్రం ఆరుగంటలకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినట్టు నిర్వాహకులు ప్రకటించారు. ఈ విషయాన్ని 24ఎఎం స్టూడియో అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను 24ఎఎం నిర్మిస్తోంది.


Click it and Unblock the Notifications











