»   » యాంకర్ సుమ గురించే వెంకయ్యనాయుడు ఎక్కువ సేపు..

యాంకర్ సుమ గురించే వెంకయ్యనాయుడు ఎక్కువ సేపు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

తిరుపతి:బాలకృష్ణ హీరోగా నటించిన 100వ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. క్రిష్‌ దర్శకుడు. శ్రియ హీరోయిన్. హేమమాలిని కీలక పాత్ర పోషించారు. చిరంతన్‌ భట్‌ స్వరాలు సమకూర్చారు. తిరుపతిలో ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం అభిమానుల మధ్య అత్యంత ఘనంగా జరిగింది.

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సమక్షంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆడియో సీడిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు ఇచ్చిన స్పీచ్ ఆశ్చర్యంగా సాగింది. ముఖ్యంగా ఆయన స్పీచ్ లో సుమ గురించి ఎక్కువ సేపు మాట్లాడారు.


Venkaiah Naidu Comments On Anchor Suma

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. గౌతమీ పుత్రుడు శాతకర్ణి అంటుండగా.. ఇందాక ఆ అమ్మాయి సుమ చెప్పినట్టు అటూ సుమ అందరి పేర్ల ముందు తల్లి పేరు చదివిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ తర్వాత సుమారు పది నిమిషాల పాటు ఆయన సుమ గురించే మాట్లాడారు.


ఇప్పుడు అంతా తెలుగు మాట్లాడటానికే ఇబ్బంది పడుతున్న సమయంలో వేరే రాష్ట్రం అమ్మాయి అయినప్పటికీ సుమ తెలుగులో అద్భుతంగా మాట్లాడుతుందని ఆమెను చూసి నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉందని అన్నారు.


Venkaiah Naidu Comments On Anchor Suma

అలాగే మమ్మీ , డాడీ, కేడీ ఇలాంటి పదాలను వదిలేసి అమ్మ, నాన్న అని పలకాలని ఆయన సూచించారు. అయితే మళ్లీ తన ప్రసంగం ముగిసిన తర్వాత కూడా మళ్లీ సుమ గురించి చాలా సేపు మాట్లాడారు.


ఈ సమయంలో సుమ నేరుగా ఆయన వద్దకు వచ్చి పాదాభివందనం చేసింది. చక్కగా తెలుగులో మాట్లాడుతున్నావమ్మా నీ ఆటా, పాటా, కట్టు బొట్టూ, తీరు, తెలుగు ఉచ్ఛరణ, సంప్రదాయం అన్నింటిలో చక్కగా ఉంటున్నావని నీకు నా అభినందనలని చెప్పారు.


Venkaiah Naidu Comments On Anchor Suma

అలాగే 'ఆడియో విడుదలకు కేంద్రమంత్రి రావడం ఏమిటని అందరూ అనుకోవచ్చు. ఇప్పుడు నేను సినిమాలకు కూడా మంత్రిని. అందుకే వచ్చా. నాకు సినిమా వాళ్లు తెలుసు. వాళ్ల సత్తా తెలుసు. కానీ సినిమాల గురించి తెలియదు. కానీ ఈ సినిమా మన చరిత్రను గురించి తెలియజేయడం సంతోషం. సినిమా నేపథ్యమే నన్ను, చంద్రబాబునాయుడి గారికి ఈ కార్యక్రమానికి రప్పించింది' అని పేర్కొన్నారు.

English summary
Gautamiputra Satakarni movie's audio launch is grandly conducted at Tirupati. Union Minister, Venkaiah Naidu who attended the audio launch function as a chief guest along with Chandrababu Naidu, has talked about Anchor Suma.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu