»   »  రిలీజ్ కు ముందే టోరెంట్ సైట్ లో ప్రత్యక్ష్యం, డైరక్టర్ గోల

రిలీజ్ కు ముందే టోరెంట్ సైట్ లో ప్రత్యక్ష్యం, డైరక్టర్ గోల

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : సినిమాలు రిలీజ్ అయిన తర్వాత టోరెంట్ సైట్ లో కనపడటం, వాటని తీసేయించటం చాలా కామన్ ధింగ్ అయిపోయింది. సినిమా వాళ్లు ఇందుకోసం ప్రత్యేకమైన టీమ్ లను సైతం పెడుతున్నారు. తమ సినిమాలు టోరెంట్ కనిపిస్తే వార్నింగ్ ఇచ్చి తీసేయించటానికి.

 VENKAT PRABHU CRIES HELP TO VISHAL

అయితే అదే టోరెంట్ ..సినిమా రిలీజ్ కు ముందు కనపడితే ..పరిస్దితి ఏమిటి...ఇప్పుడు అలాంటి సిట్యువేషన్ నే తమళ దర్శకుడు వెంకట్ ప్రభు ఎదుర్కొంటున్నారు. ఆయన తాజా చిత్రం ‘చెన్నై 600028' సెకండ్ ఇన్నింగ్స్ అప్పుడే టోరెంట్ సైట్ లో కనపడింది.

ఈ విషయమై ఆయన తమిళ సినిమా అశోషియేషన్ లో పిర్యాదు చేస్తూ..విశాల్ ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేసారు.


‘చెన్నై 600028' తమిళ సినీ పరిశ్రమలో లో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు వెంకట్ ప్రభు. తొలి చిత్రానినే అయినా విమర్శకుల ప్రశంసలు పొంది సూపర్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం. ఈ సినిమాతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత ... సరోజా, గ్యాంబ్లర్, బిర్యాని, రాక్షసుడు వంటి చిత్రాల అందించాడు. విభిన్నమైన సినిమాలతో మెప్పిస్తున్న వెంకట్ ప్రభుకు ఈ మధ్య ఫ్లాఫ్ లు ఎక్కవయ్యాయి. ప్రస్తుతం చెన్నై 600028 కు సీక్వెల్ గా మరో సినిమాను తెరకెక్కిస్తున్నాడు.


చెన్నై 600028 సెకండ్ ఇన్నింగ్స్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ను మొదలుపెట్టి, అప్పుడే పూర్తి చేశాడట. తాజాగా ఈ సీక్వెల్ టీజర్ ను కూడా విడుదల చేశాడు వెంకట్ ప్రభు. గల్లీ క్రికెట్ నేఫధ్యంగా తెరకెక్కే ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా మొదటి భాగానికి పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
“Vishalkofficial Machi pls help”, cried an alarmed director Venkat Prabhu through his Twitter account last night.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu