Don't Miss!
- Travel
అద్భుత కళాకృతుల నిలయం.. రఘురాజ్పూర్..
- Technology
భారత్లో 46 వేల ఖాతాలపై నిషేధం విధించిన Twitter!
- Automobiles
భారత మార్కెట్లో సుజుకి కటానా Suzuki Katana స్పోర్ట్స్ బైక్ విడుదల; ధర రూ.13.61 లక్షలు
- Finance
Free Shares: 50 వేలకు పైగా రైతులకు ఉచితంగా షేర్లు.. ఆరు రాష్ట్రాల్లోని వారికి ఉపయోగం..
- News
viral video:ఏందిది..? పార్క్ చేసిన బైక్ నుంచే సీసీ రోడ్డు, అందుకు పర్మిషన్ ఇవ్వలేదట..?
- Lifestyle
Diabetic UTI :మధుమేహం UTI ప్రమాదాన్ని పెంచుతుంది, ఈ విధంగా సంక్రమణను నివారించవచ్చు..
- Sports
IND vs SL: వారెవ్వా వాటే కీపింగ్.. క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన వీడియో
నాగచైతన్యతో మరో సారి ఉప్పెన బ్యూటీ.. స్టార్ డైరెక్టర్ బై లింగ్యువల్ మూవీ స్టార్ట్!
విడాకుల ప్రకటన తర్వాత అక్కినేని నాగచైతన్య వరుస సినిమాలు ప్రకటిస్తూ వెళ్తున్న విషయం తెలిసిందే. ఆయన నుంచి వచ్చిన అన్ని సినిమాలు దాదాపు హిట్ అవుతున్నాయి. తాజాగా ఆయన తమిళ తెలుగు భాషల్లో ఏక కాలంలో మరో సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
ఆ సినిమా తర్వాత నాగార్జునతో కలిసి నాగచైతన్య నటించిన బంగార్రాజు సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే సినిమా చేస్తున్నాడు.
దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య దూత అనే ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్స్ లో భాగంగా ఈ వెబ్ సిరీస్ ను అమెజాన్ సంస్థ నిర్మిస్తోంది.

ఈ సినిమాల తర్వాత ఆయన తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఒక సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం జరగగా దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అక్కినేని నాగచైతన్యతో కలిసి ఒక తమిళ తెలుగు ద్విభాషా మూవీ చేస్తున్నానని ఆయన ప్రకటించగా ఇప్పుడు ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది.
ఇక ఈ సినిమాను సమంతతో యూ టర్న్, రామ్ హీరోగా ది వారియర్, అలాగే బోయపాటి రామ్ కాంబో సినిమాలు నిర్మిస్తున్న శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నారు. చైతు కెరీర్ లో 22వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఇక ఈ సినిమా ప్రారంభోత్సవం తాజాగా హైదరాబాద్ లో జరిగింది. ఈ ప్రారంభోత్సవ వేడుకలో రానా, లింగుస్వామి, బోయపాటి శ్రీను, శివ కార్తికేయన్ వంటి వారు పాల్గొన్నారు. ఇక బంగార్రాజు సినిమాలో చైతూ జోడీగా నటించిన కృతి శెట్టి ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా ఎంపికయింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.