»   »  వ్యంగ్యాస్త్రం ( 'బిల్లా రంగ' ప్రివ్యూ)

వ్యంగ్యాస్త్రం ( 'బిల్లా రంగ' ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్‌: గతంలో ఎలక్షన్ సీజన్ లో రాజకీయ వ్యంగ్యాస్త్ర చిత్రాలు చాలా వచ్చేవి. అయితే కాలక్రమేణా వాటి సంఖ్య తగ్గిపోయి...అప్పుడప్పుడూ ఒకటీ,అరా మెరుస్తున్నాయి. ఇప్పుడు ఎలక్షన్ ప్రచారాలు హోరా హోరీగా జరుగుతున్న ఈ సమయంలో నేటి రాజకీయాలను టార్గెట్ చేస్తూ... ఎన్నికలపై వ్యంగ్యాస్త్రంగా ఈ రోజు థియోటర్లో దిగుతున్న చిత్రం 'బిల్లా రంగ'.

  జాతీయ పురస్కార గ్రహీత ప్రదీప్‌ మాడగుల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం పూర్తి స్థాయి వినోదాత్మకంగా తీర్చిదిద్దినట్లు దర్శకుడు ప్రదీప్‌ తెలిపారు. ''వూరి బాగుకోసం పాటుపడే యువకుల కథ ఇది. రాజకీయాలపై వ్యంగ్యాస్త్రం అనుకోవచ్చు. ''అని నిర్మాతలు తెలియచేసారు.

  మధుర శ్రీధర్‌ మాట్లాడుతూ ''ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థను కళ్లకు కట్టినట్టు చూపించే చిత్రమిది. ప్రచార చిత్రాలు బాగున్నాయి. 'అద్వైతం'కి అవార్డులు అందుకొన్న ప్రదీప్‌.. ఈ చిత్రానికీ అలాంటి పురస్కారాలు అందుకోవాలని ఆశిస్తున్నాను''అన్నారు.

  సత్యానంద్ మాట్లాడుతూ "ఇందులో నటించడానికి నా శిష్యుడు మహేంద్ర చక్రవర్తి కారణం. అందరికీ నచ్చే పాత్ర చేశాను. దర్శకుడు సినిమాను తెరకెక్కించిన తీరు నచ్చింది. పాటలు బాగా కుదిరాయి'' అని అన్నారు.

  రాహుల్ వెంకట్ మాట్లాడుతూ "నా తొలి సినిమాకు భిన్నంగా ఉంటుందీ సినిమా. సంతోష్ నారాయణన్ ఎనర్జిటిక్ పాటలిచ్చారు'' అని తెలిపారు.

  దర్శకుడు ప్రదీప్ మాడుగుల మాట్లాడుతూ - రాజకీయ నేపథ్యంలో సాగుతూ, ప్రేక్షకులకు ఓ సందేశం అందించేలా చిత్రం రూపొందిందని తెలిపారు. ఫిబ్రవరిలో సినిమా షూటింగ్ పూర్తయినా అప్పుడు విడుదల చేయడం సరైన సమయం కాదని, ఇప్పుడు విడుదల చేస్తున్నామని, కామెడీ, పొలిటికల్ మూవీగా రూపొందిన ఈ చిత్రం ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థకు అద్దంపట్టేలా సాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి ఆదరణ లభిస్తోందని, పొలిటికల్ సెటైర్‌గా రూపొందిన ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంటుందని చెప్పారు.

  Venkat Rahul's Billa Ranga preview

  పతాకం: వాక్ కార్ప్ ఇన్ అసోసియేషన్ విత్ స్కై కార్ప్
  నటీనటులు: వెంకట్‌ రాహుల్‌, ప్రదీప్‌, రిషిక, కోమల్ ఝా, అజయ్‌ఘోష్, చరణ్‌దీప్, జీవా, గౌతమ్‌రాజు, మధు, వేణు, నవీన్, వెన్నెల రామారావు, భూపతిరాజా, కీరు, మహేంద్ర చక్రవర్తి, శాంతిరావు, తేజ, శోభ, పద్మజ తదితరులు
  కెమెరా:ఎస్.వి.విశేవశ్వర్,
  సంగీతం:సంతోష్ నారాయణన్,
  పాటలు:వశిష్ఠ శర్మ,
  ఎడిటింగ్:చంద్రశేఖర్,
  సహ నిర్మాతలు: చరణ్‌దీప్ సుర్నేని, నవీన్ మోర,
  నిర్మాతలు: అరవింద్ వన్నాల, వంశీ బోయిన, కాశిరెడ్డి సుధీర్ రెడ్డి,
  కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రదీప్ మాడుగుల.

  English summary
  
 
 'Billa Ranga' a new film by all rookie makers Vamsy Boyina, Arvind Vannala and Kasireddy Sudheer Reddy producing on the banner Sky-Vak Corporation and directed by Pradeep Madugula. The film has Rahul Venkat, Pradeep Bento and Rishika in the lead roles and ace acting trainer Satyanand playing a special role.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more