»   » పవన్‌ తో నా కాంబినేషన్ ఉంటుంది: వెంకటేష్

పవన్‌ తో నా కాంబినేషన్ ఉంటుంది: వెంకటేష్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి నటిస్తే ఎలా ఉంటుది. ఆ ప్రపోజల్ ఇంతకు ముందో సారి వచ్చింది. వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కానీ..పవన్ డేట్స్ ప్లాబ్లంతో ముందుకు వెళ్లదే. ఆ విషయమై వెంకటేష్ మాట్లాడుతూ... పవన్‌తో సినిమా అనుకున్నా కుదర్లేదు. ఈసారి తప్పకుండా నటిస్తాం అంటున్నారు వెంకటేష్. ఆ ప్రపోజల్ మరేదో కాదు...శ్రీకాంత్ అడ్డాల దర్సకత్వంలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అని సమాచారం. అందులో మహేష్ వేసిన తమ్ముడు పాత్రకు మొదట పవన్ కళ్యాణ్ ఆప్షన్.

ఇక మల్టీస్టారర్‌ హంగామా కొనసాగింపు విషయమై మాట్లాడుతూ వెంకటేష్ స్పందిస్తూ...మంచి కథలొస్తే తప్పకుండా చేస్తా. సోలో హీరోగా రెండు సినిమాలు చేస్తే.. ఒకటి మరో హీరోతో కలసి చేస్తా. త్వరలో రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేస్తున్నా. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తారు అని చెప్పారు. ఆయన హీరోగా నటించిన 'మసాలా' ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీపావళి సందర్భంగా వెంకటేష్‌తో మీడియా ప్రత్యేకంగా సంభాషించింది.

దగ్గుబాటి కుటుంబం అంతా కలసి నటిస్తారని చెప్పుకొంటున్నారు.. అనే మ్యాటర్ పై మాట్లాడుతూ...అందరూ కలసి ఓ సినిమా చేద్దామని నాన్నగారు అడిగారు. రెండు మూడు కథలు కూడా విన్నా. కానీ నచ్చలేదు. కథ విషయంలో రాజీ పడను. ఎందుకంటే మా కుటుంబం అంతా కలసి నటిస్తుంటే ప్రేక్షకులు చాలా వూహిస్తారు. అందుకు ఏమాత్రం తగ్గకూడదు అని వివరించారు.


'మసాలా' రుచులు ఎలా ఉండబోతున్నాయనే విషయం మాట్లాడుతూ...పేరుకు తగ్గట్టు నోరూరించే సినిమా ఇది. కథ, కథనాల్లో ఎలాంటి గందరగోళం ఉండదు. నేనూ రామ్‌ కలసి చేస్తున్నామంటే జనాల్లో ఆసక్తి ఉంటుంది. దానికి తగ్గట్టే సినిమా వినోదాత్మకంగా సాగిపోతుంది. అక్కడక్కడ కొన్ని యాక్షన్‌ సన్నివేశాలు వస్తుంటాయి. మా ఇద్దరి పాత్రలు చాలా బాగా కుదిరాయి. ముఖ్యంగా రామ్‌ పాత్రలో రెండు పార్శ్వాలు ఉంటాయి. నా వేషధారణ, శరీరభాష, ఇంగ్లీష్‌ డైలాగులూ ఇవన్నీ నచ్చుతాయనే నమ్మకం ఉంది అన్నారు.

రీమేక్‌ గురించి చెప్తూ...రీమేక్‌ అన్నామని కాపీ పేస్ట్‌ చేస్తే కుదరదు. మాతృకను అర్థం చేసుకొని మన తెలుగువాళ్లకు చేరువయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి. నా వరకూ ఏదైనా సినిమా రీమేక్‌ చేయాలనుకొంటే ఆ సినిమా నా స్నేహితులకూ, ఇంట్లోవాళ్లకూ చూపిస్తా. వాళ్లు ఎక్కడెక్కడ సినిమాను ఆస్వాదిస్తున్నారు? ఎక్కడ విసుగొచ్చింది? ఇలాంటి విషయాలు ఆరా తీస్తా. దాంతో మార్పులు చేసుకోవడం సులభం అవుతుంది. 'బోల్‌బచ్చన్‌' విషయంలోనూ అదే చేశాం అన్నారు.

English summary

 Venkatesh says that his combination will become real soon. Present he is waiting for Masala. Masala film directed by Vijay Bhaskar,produced by Sravanthi Ravikishore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu