twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకీ చెప్పింది నిజమే... ఇబ్దందే

    By Srikanya
    |

    హైదరాబాద్ :ఇటీవల దర్శకులు, రచయితలు ఎక్కువగా యువ హీరోల్ని దృష్టిలో ఉంచుకొని కథల్ని సిద్ధం చేస్తున్నారు. దాంతో మా తరం హీరోలకు కాస్త ఇబ్బందిగా మారింది. రీమేక్‌ కథలపై దృష్టిపెట్టడానికి అదీ ఒక కారణం కావొచ్చు. ప్రయాగాలు చేయడానికి కూడా ఇదే సరైన సమయం అని భావిస్తున్నా. మంచి కథ వస్తే విలన్‌గా నటించడానికైనా సిద్ధమే అన్నారు వెంకటేష్. ఆయన ఇటీవల నటించిన చిత్రం 'దృశ్యం'. ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకొస్తోంది. విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

    వెంకటేష్ మాట్లాడుతూ... చాలా రోజుల తర్వాత నేను చేసిన ఒక పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రం 'దృశ్యం'. ఇందులో ఒక మధ్య తరగతి తండ్రిగా నటించా. ఇందులో అదనంగా థ్రిల్లర్‌ తరహా అంశాలు ఉంటాయి. నా పాత్ర పేరు రాంబాబు. కేబుల్‌ ఆపరేటర్‌గా పనిచేస్తుంటాడు. సినిమాలంటే పిచ్చి. భార్య, ఇద్దరు పిల్లలతో హాయిగా సాగిపోతున్న అతని కుటుంబంలో ఉన్నట్టుండి ఓ పెద్ద కుదుపు. ఆ సమస్యని ఎలా అధిగమించాడన్నదే కీలకం అన్నారు.

    Venkatesh about his latest Drushyam

    ఇక ఈ సినిమాలో కనిపించే రాంబాబుకు నాకూ దగ్గరి పోలికలున్నాయి. సినిమా చూస్తూ రాంబాబు ఏడుస్తుంటాడు. నిజ జీవితంలో నేనూ అంతే. ఏదైనా సెంటిమెంట్‌ సన్నివేశాన్ని తెరపై చూస్తున్నప్పుడు కళ్లల్లో నీళ్లొస్తుంటాయి. అన్నట్టు ఏడిపించడంలోనూ నేనే ముందుంటాను కదా (నవ్వుతూ). 'నువ్వు బాగా ఏడిపిస్తావ్‌..' అని చాలామంది నాతో అంటుంటారు. 'రాజా', 'ధర్మచక్రం', 'వసంతం', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' ఇలా చాలా సినిమాల్లో బాగా ఏడిపించా. అదంతా సినిమా గొప్పదనమే. నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. అందుకు ఎవరూ అతీతులు కారు అన్నారు.

    వెంకటేష్ మాట్లాడుతూ.... ఇక్కడ ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకోలేం. ఎంతసేపూ సురక్షితంగానే ప్రయాణం చేయాలి. ఆ పంథాలో ఆలోచించినప్పుడే రీమేక్‌ సినిమాలు తెరకెక్కుతుంటాయి. అయినా రీమేక్‌ చేయడం తప్పేం కాదు. మంచి సినిమా అనుకొన్నప్పుడు... దాన్ని మన ప్రేక్షకులకు కూడా అందేలా చేయాలి. అలా చేసిన ప్రతీసారీ నాకు విజయం దక్కింది.

    నిర్మాత మాట్లాడుతూ...''గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు.. వాటి వల్ల ఆయా కుటుంబ సభ్యులు పడుతున్న ఇబ్బందుల్ని కళ్లకు కట్టేలా దర్శకురాలు తీర్చిదిద్దుతున్నారు. అనేక సమకాలీన అంశాల్ని చిత్రంలో పొందుపరుస్తున్నారు. తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధాన్ని చూపే సన్నివేశాల్ని దర్శకురాలు చక్కగా తెరకెక్కిస్తున్నారు'' అంటున్నారు.

    మీనా హీరోయిన్ గా చేసే ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్‌ థియేటర్స్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌, వైడ్‌ యాంగిల్‌ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాజ్‌కుమార్‌ సేతుపతి నిర్మాత. డి.సురేష్‌బాబు సమర్పకులు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం వైజాగ్ లోని అందమైన లొకేషన్స్‌లో జరుగుతోంది. చిత్ర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. చిత్రంలో నదియా ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. త్వరలో సినిమా పేరుని ప్రకటిస్తారు.

    English summary
    Venky's 'Drushyam', Remake of Malayalam Blockbuster is gearing up for July 11th release. The film is now progressing in Araku, Vizag District. Venky, Meena, Ravi Kale, Chalapathi Rao and etc., are participating in ongoing schedule.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X