»   »  వెంకటేష్ క్యారెక్టర్ ఇదీ

వెంకటేష్ క్యారెక్టర్ ఇదీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వెంకటేష్ సినిమాల్లో హాస్యం ప్రధానంగా ఉండేటట్లు చూసుకుంటూంటాడు. ముఖ్యంగా ఆయన పాత్రను డిఫెరెంట్ గా డిజైన్ చేస్తూంటారు. ఇప్పుడు ఆయన తాజా చిత్రం 'దృశ్యం' లోనూ ఆయన పాత్ర అదే తరహాలో ఉంటుందంటున్నారు. ఆ పాత్ర పేరు రాంబాబు. కలకు, నిజానికీ మధ్య వూగిసలాడే మధ్య తరగతి మనస్తత్వం రాంబాబుది. కుటుంబమంటే ప్రాణం. ఉన్నదాంట్లో సంసారాన్ని ఈదుకొస్తుంటాడు.

రాంబాబుకు ఓ సరదా కూడా ఉంది. అదే.. సినిమా! భాషతో పనిలేదు. హీరో ఎవరో అక్కర్లెద్దు. అది సినిమా అయితే చాలు. టైటిల్‌ కార్డు నుంచి శుభం కార్డు వరకూ చూసేస్తాడు. ఆ క్షణంలో ఇల్లు కూడా గుర్తుకురాదు. ఇటు సినిమాలతో అటు.. కుటుంబంలో చిన్ని చిన్ని సరదాలతో గడిపేస్తున్న రాంబాబు జీవితంలో అనూహ్యమైన మార్పులొచ్చాయి. అదెందుకో తెలియాలంటే 'దృశ్యం' చూడాల్సిందే.

Venkatesh to be seen as Rambabu

వెంకటేష్‌, మీనా ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమిది. మలయాళంలో విజయవంతమైన 'దృశ్యమ్‌' చిత్రానికి రీమేక్‌. శ్రీప్రియ దర్శకత్వం వహించారు. డి.సురేష్‌బాబు, రాజ్‌కుమార్‌ సేతుపతి నిర్మాతలు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 11న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

వెంకటేష్‌ మాట్లాడుతూ ''ప్రతి కుటుంబంలోనూ మంచి, చెడు ఉంటాయి. తనకు నచ్చని విషయాలపై రాంబాబు అనే సగటుమనిషి ఎలా పోరాడాడో చూపిస్తున్నామ''న్నారు. ''కుటుంబ కథలో థ్రిల్లర్‌ అంశాల్ని మేళవించడం ఇదే తొలిసారి. వెంకటేష్‌, మీనా జోడీ మరోసారి ఆకట్టుకోవడం ఖాయం'' అని సురేష్‌బాబు చెబుతున్నారు.

నదియ, ఎస్తర్‌, కృతిక, పరుచూరి వెంకటేశ్వరరావు, చలపతిరావు, సమీర్‌, కాశీ విశ్వనాథ్‌, బెనర్జీ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: శరత్‌, సమర్పణ: డి.రామానాయుడు.

English summary
In ‘Drishyam’movie, Venkatesh will be seen as Rambabu who is a simple guy who loves his family a lot.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu