»   » మచ్చ లేని చిట్టిబాబు, సుకుమార్‌కు హ్యాట్సాఫ్..రంగస్థలంపై వెంకీ ఆసక్తికర కామెంట్స్!

మచ్చ లేని చిట్టిబాబు, సుకుమార్‌కు హ్యాట్సాఫ్..రంగస్థలంపై వెంకీ ఆసక్తికర కామెంట్స్!

Subscribe to Filmibeat Telugu
Venkatesh Sensational Comments On Rangasthalam Movie

టాలీవుడ్ లో హీరోల మధ్య ఆరోగ్యకర వాతావరణం పెరుగుతోంది. స్టార్ హీరోలంతా మరో స్టార్ హీరో చిత్రంపై స్పందించడం అరుదుగా జరుగుతుంటుంది. మల్టి స్టారర్ చిత్రాలలో నటించడంలో, మిగిలిన హీరోలతో కలివిడిగా మెలగడంలో విక్టరీ వెంకటేష్ ముందుంటారు. తాజగా వెంకటేష్ రంగస్థలం చిత్రంపై స్పందించారు. రంగస్థలం చిత్రం చూసిన తరువాత వెంకీ సోషల్ మీడియాలో తన స్పందనని తెలియజేశాడు. రంగస్థలం చిత్రం విజయం పట్ల పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రానా మరియు ఇతర హీరోలు స్పందించిన సంగతి తెలిసిందే.

 బాహుబలి తరువాత

బాహుబలి తరువాత

కలెక్షన్ల విషయంలో రంగస్థలం చిత్రం చెర్రీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. టాలీవుడ్ లో బాహుబలి తరువాత స్థానాన్ని ఆక్రమించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. రంగస్థలం జైత్ర యాత్ర ట్రేడ్ నిపుణులకు కూడా షాక్ ఇచ్చేలా కొనసాగుతోంది.

రాంచరణ్ గురించే అంతా

రాంచరణ్ గురించే అంతా


రంగస్థలం చిత్రంలో రాంచరణ్ నటన గురించే అంతా చర్చించుకుంటున్నారు. రాంచరణ్ ఈ చిత్రంలో కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ చేసాడని అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు హీరోలు రంగస్థలం చిత్రంపై స్పందించిన తరువాత విక్టరీ వెంకటేష్ కూడా రంగస్థలం చిత్ర యూనిట్ కు అభినందనలు తెలియజేసాడు.

మచ్చలేని చిట్టిబాబు

తాను రంగస్థలం చిత్రం చూసిన విషయాన్ని వెంకటేష్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. చిట్టిబాబుగా రాంచరణ్ నటన మచ్చ లేని విధంగా ఉందని వెంకీ తెలిపాడు.

సుకుమార్ కు హ్యాట్సాఫ్

సుకుమార్ కు హ్యాట్సాఫ్

దర్శకుడు సుకుమార్ కు హ్యాట్సాఫ్ అంటూ వెంకీ అభినందనలు తెలియజేసాడు. ఈ చిత్రంలో సుకుమార్ పాత్రలని మలచిన విధానం అద్భుతంగా ఉందని వెంకీ కితాబిచ్చాడు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ ని వెంకీ ఈ సందర్భంగా అభినందించడం విశేషం.

English summary
Venkatesh beautiful words on Ram Charan after watching Rangasthalam. Venkatesh praises director Sukumar
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X