»   » వెంకటేష్ కి అంత సీన్ లేదంటున్న సూపర్ స్టార్ అభిమానులు...

వెంకటేష్ కి అంత సీన్ లేదంటున్న సూపర్ స్టార్ అభిమానులు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

'చంద్రముఖి" పేరు చెప్పి దాని సీక్వెల్ గా పేర్కొనబడుతున్న 'నాగవల్లి"కి హడావిడి బాగానే చేస్తున్నారు కానీ నిజానికి ఈ సినిమాకి అంత సీనుందా అన్నదే వేచి చూడాల్సిన అంశం. 'ఆప్తమిత్ర" సీక్వెల్ గా కన్నడలో తీసిన 'ఆప్తరక్షక"ని మళ్లీ రజీనాకాంత్ తోనే చేయాలనే ప్రయత్నం బెడిసికొట్టడంతో చివరకు వెంకటేష్ తో అడ్జస్ట్ అయ్యారు.

అయితే 'చంద్రముఖి" లాంటి నాసిరకం చిత్రాన్ని రజనీకాంత్ తన సూపర్ స్టార్ డమ్ తో హిట్ చేశారు. మరదే మ్యాజిక్ ని వెంకటేష్ రిపీట్ చేయగలరా అన్నదే అనుమానంగా ఉంది. ముఖ్యంగా ఈ చిత్రంలో రాజు గెటప్ లో కనిపించే దశ్యాల్లో వెంకీ నటన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. 'లక లక లక" అంటూ చంద్రముఖిని రజనీకాంత్ అమాంతం హైట్స్ కి తీసుకెళ్లారు. మరి వెంకటేష్ కూడా రజనీలానే ఆ పాత్రని రక్తి కట్టించగలరా అన్నది సినిమా రిలీజ్ అయితేనే కానీ తెలియదు. వెంకటేష్ మాత్రం ఆ క్యారెక్టర్ బాగా చేశానని నమ్మకంగా ఉన్నారు. ఆ క్యారెక్టర్ క్లిక్ కాకపోతే మాత్రం ఇంత ప్రయాస పడి చంద్రముఖికి సీక్వెల్ తీయడం అవుతుంది.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu