»   » చంద్రముఖి మళ్ళీ వచ్చింది (నాగవల్లి ప్రివ్యూ)

చంద్రముఖి మళ్ళీ వచ్చింది (నాగవల్లి ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

మానసిక వైద్య నిపుణుడు విజయ్‌ (వెంకటేష్‌). ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు. తన చుట్టూ ఉన్నవాళ్లూ ఆనందంగా ఉండాలనుకొంటాడు. ఎలాంటి మానసిక సమస్యనైనా పరిష్కరించగలరు. ఆయన దగ్గరకొచ్చిన ఓ కేసుతో విజయ్‌ ప్రస్థానమే మారుతుంది. అసలు ఆ కేసు ఏమిటి? ఆ సమస్యకి ఎలాంటి పరిష్కారం దొరికింది..విజయ్ ‌కి ఎదురైన సమస్యలేమిటి..అనేది మిగతా కథ. అలాగే అసలు ఈ కథలో నాగవల్లి ఎవరు అనేది సస్పెన్స్‌. ఇక ఈ చిత్రంలో హైలెట్స్ ను నిర్మాత బెల్లంకొండ సురేష్ చెబుతూ.."చంద్రముఖి చిత్రానికి కొనసాగింపుగా వస్తున్నా...ఇదో ప్రత్యేకమైన సినిమా. వెంకటేష్‌ మూడు రకాల పాత్రల్లో కనిపిస్తారు. ఆరుగురు కథానాయికల్లో 'నాగవల్లి' ఎవరన్నది ఆసక్తికరం. ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించేలా కథ, కథనాలుంటాయి. వెంకీ నటన, ఆయన గెటప్స్‌ ప్రత్యేక ఆకర్షణ" అన్నారు. ఈ చిత్రం ఈ రోజే విడుదల అవుతోంది. పి.వాసు దర్సకత్వంలో రూపొందిన ఈ కన్నడ చిత్రం ఆప్తరక్షక చిత్రం రీమేక్ గా కనపడుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu