»   » వెంకటేష్..చంద్రముఖి సీక్వెల్ తాజా సమాచారం

వెంకటేష్..చంద్రముఖి సీక్వెల్ తాజా సమాచారం

Posted By:
Subscribe to Filmibeat Telugu

పి.వాసు దర్శకత్వంలో చంద్రముఖి సీక్వెల్(ఆప్త రక్షక రీమేక్)వెంకటేష్ హీరోగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ సురేష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రంలో అయిదుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఈ భామలతో వెంకీకి ఉండే బంధం ఏమిటన్నది తెర మీదే చూడాలి అంటున్నారు దర్శక, నిర్మాతలు. అలాగే 'చంద్రముఖి'కి కొనసాగింపుగా వచ్చే ఈ కథలో వెంకీ పాత్రకి ఎంతో ప్రాధాన్యం ఉందనీ, ఆయన శైలి నటన, ఆహార్యం తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెలలో కీలకమైన సన్నివేశాల్ని ఏకబిగిన ఒకే షెడ్యూల్‌లో తెరకెక్కిస్తారు. మైసూర్‌, బెంగళూరు, బరోడాల్లో చిత్రీకరణ చేస్తారని సమాచారం. అనుష్క, కమలిని ముఖర్జీ, శ్రద్ధాదాస్‌, పూనమ్‌కౌర్‌, రిచా గంగోపాధ్యాయ ఈ చిత్రంలో హీరోయిన్స్.

చంద్రముఖి చిత్రం చూసిన వాళ్ళు 'లక లక లక లక' ని మర్చిపోవటం చాలా కష్టం. ఇప్పుడా 'లక లక లక లక' డైలాగుని 'లీడర్‌' చిత్రంతో పరిచయమైన రిచా గంగోపాధ్యాయ వల్లిస్తోంది. పి.వాసు దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతోన్న చంద్రముఖి సీక్వెల్ లో ఆమె ఈ ఊతపదం వాడుతుంది. ఈ విషయాన్ని రిచానే కన్ఫర్మ్ చేసింది. అలాగే వెంకటేష్ ని దెయ్యంలా తరిమే పాత్రలో కమిలినీ ముఖర్జీ కనపడనుంది. కన్నడంలో సూపర్ హిట్టయిన ఆప్త రక్షక చిత్రం రీమేక్ లో ఆమె చనిపోయి దెయ్యంగా మారే అమ్మాయిగా నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో అనుష్క మెయిన్ రోల్ చేస్తోంది. ఇక దెయ్యం వేషం గురించి కమిలిని మాట్లాడుతూ...కథలో కీలకమైన పాత్ర అది..అందుకే ఒప్పుకున్నాను.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu