Just In
- 2 min ago
స్టార్ డైరెక్టర్ శిష్యుడితో నాగశౌర్య మరో డిఫరెంట్ మూవీ.. టైటిల్ కొత్తగా ఉందే!
- 8 min ago
చిరంజీవి కోసం బాలీవుడ్ ప్రముఖుడు: తెలుగులో ఇది మూడో సినిమా మాత్రమే!
- 23 min ago
‘క్రాక్’ తర్వాత నందమూరి బాలకృష్ణతో సినిమా: క్లారిటీ ఇచ్చిన గోపీచంద్ మలినేని
- 1 hr ago
నాని హీరోయిన్.. మొత్తానికి పెద్ద హీరోనే పట్టేసింది
Don't Miss!
- Sports
ఇంటికి రాగానే దెబ్బ తగిలిన ప్రతి చోట ముద్దులు పెట్టింది: పుజారా
- News
Capital Gains Tax అంటే ఏంటి..? బడ్జెట్ వేళ పూర్తి వివరాలు మీకోసం..!
- Lifestyle
డయాబెటిస్ ఉన్నప్పటికీ సుదీర్ఘకాలం మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఇక్కడ కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఉన్నాయ
- Finance
ఫ్యూచర్ గ్రూప్ డీల్, అమెజాన్‌కు షాక్: రిలయన్స్‌కు గుడ్‌న్యూస్, షేర్ జంప్
- Automobiles
భారత్‌లో అడుగుపెట్టిన కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్; ధర & వివరాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వెంకటేష్ 'చంద్రముఖి-2' రిలీజ్ అప్పుడే...
వెంకటేష్ హీరోగా రూపొందుతున్న చంద్రముఖి సీక్వెల్ చిత్రం అక్టోబర్ రెండవ వారంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం బెంగళూరులో జరుగుతోంది. వచ్చేనెల 5 వరకూ అక్కడే కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తారు. ఆ తర్వాత హైదరాబాద్ లో మరో షెడ్యూలు ఉంటుంది. పి.వాసు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా అనూష్క చేస్తోంది. చింతకాయల రవి తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఇదే. ఇక ఈ పీరియాడిక్ ధ్రిల్లర్ లో వెంకటేష్ వృధ్దుడు గెటప్ లో కూడా కనిపించనున్నాడని సమాచారం. ఇక ఈ చిత్రానికి మూలమైన కన్నడ ఆప్త రక్షకలో వెంకటేష్..విష్ణు వర్దన్ ఆ పాత్రను పోషించాడు.
ఆప్త రక్షక కన్నడ చిత్రాన్ని కూడా పి.వాసు డైరక్ట్ చేసారు. బెల్లంకొండ సురేష్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. అలాగే ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్ గా చంద్రముఖి 2 అని వుంచి తర్వాత మార్చే యోచనలో ఉన్నారు. అలాగే ఈ చిత్రంలో అనూష్కతో పాటు కమలినీ ముఖర్జీ, శ్రద్ధాదాస్, పూనమ్ కౌర్, రిచా గంగోపాధ్యాయ వెంకీతో ఆడిపాడతారు సాంకేతికంగా ఉన్నత విలువలతో తీర్చిదిద్దుతున్న ఈ చిత్రాన్ని అక్టోబరులో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే చంద్రముఖి చిత్రం చూసిన వాళ్ళు 'లక లక లక లక' ని మర్చిపోవటం చాలా కష్టం. ఇప్పుడా 'లక లక లక లక' డైలాగుని 'లీడర్' చిత్రంతో పరిచయమైన రిచా గంగోపాధ్యాయ వల్లిస్తోంది.