»   » వీక్ కాదు: రామ్ చరణ్ సినిమాపై వెంకీ కామెంట్

వీక్ కాదు: రామ్ చరణ్ సినిమాపై వెంకీ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా కృష్ణ వంశీ దర్శకత్వంలో 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ సినిమాలో వెంకటేష్‌ను ఎంపిక చేసారు. కానీ ఉన్నట్టుండి వెంకటేష్ ఈ చిత్రం నుండి తప్పుకున్నారు. దీంతో ఆ పాత్రకు శ్రీకాంత్‌ను ఎంపిక చేసారు.

అయితే వెంకీ సినిమా నుండి తప్పుకోవడంతో అప్పట్లో రకరకాల వార్తలు వినిపించాయి. స్ర్కిప్టు వీక్‌గా ఉండటం వల్లనే వెంకటేష్ తప్పుకున్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ వార్తలపై ఎట్టకేలకు వెంకటేష్ క్లారిటీ ఇచ్చారు. స్క్రిప్టు వీక్‌గా ఉందనే వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసారు.

Venkatesh comment about GAV

'నా ఇమేజ్‌కు తగిన విధంగా రోల్ లేక పోవడం వల్లనే నేను సినిమా నుండి తప్పుకోవడం జరిగింది. యూనిట్ సభ్యులు కూడా అదే భావించారు. నా స్థానంలో వేరే యాక్టర్‌ను తీసుకోవాలనుకున్నారు. నాకైతే స్క్రిప్టు బాగా నచ్చింది. నా పాత్రలో ఇమడానికి ట్రై చేసాను' అని వెంకటేష్ తెలిపారు. 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రం గొప్ప చిత్రం అవుతుందని వెంకటేష్ అంటున్నారు. విడుదలకు ముందే వెంకటేష్ ఈ సినిమాకు మంచి ఫీడ్ బ్యాక్ ఇవ్వడంపై మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గోవిందుడు అందరివాడేలే' చిత్రం ఆడియో ని ఆగస్టు 20న విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే టీజర్ ని కృష్ణ వంశీ పుట్టిన రోజున అంటే ఈ నెల 28న విడుదల చేస్తున్నారు. ఆగస్టు 15 నాటికి టాకి పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. శ్రీకాంత్, కమలిని ముఖర్జీ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

English summary
The Veteran actor also gave assurance that Govindudu Andarivadele is going to be a great film. Ram Charan fans and GAV unit are making merry with Venkatesh’s comments on the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu