»   » భార్య,ఇద్దరు పిల్లలతో వెంకటేష్(ఫొటోలు)

భార్య,ఇద్దరు పిల్లలతో వెంకటేష్(ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మిడిల్ క్లాస్ యువకుడుగా చెయ్యాలన్నా, తన వయస్సుకు తగ్గ పాత్రలు ఎంచుకోవాలన్నా వెంకటేష్ తర్వాతే ఎవరైనా అనేది అందరూ ఒప్పుకునే సత్యం. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యే పాత్రలు చేయటంలో వెంకటేష్ ముందుంటారు. అందుకే ఆయనకు ఫ్యామిలీ ప్రేక్షకులు ఎక్కువ ఉంటారు. తాజాగా ఆయన మరో కుటుంబ కధా చిత్రం చేస్తున్నారు.

ఈ చిత్రంలో ఇద్దరు పిల్లలున్న మధ్య తరగతి తండ్రి గా వెంకటేష్ కనిపిస్తారు. కుటుంబమే అతని ప్రపంచం. సుఖసంతోషాలతో సాగిపోతున్న ఆ జీవితంలో అనుకోకుండా ఓ సంఘటన చోటు చేసుకొంది. అది ఎలాంటి పరిణామాలకు దారి తీసిందో 'దృశ్యం'లో చూడాల్సిందే.

వెంకటేష్‌, మీనా జంటగా నటించిన చిత్రమిది. శ్రీప్రియ దర్శకత్వం వహిస్తున్నారు. డి.సురేష్‌బాబు, రాజ్‌కుమార్‌ సేతుపతి నిర్మాతలు. డి.రామానాయుడు సమర్పిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఈ కొత్త కుటుంబం ఫొటోలు స్లైడ్ షోలో...

రీమేక్ ఇది

రీమేక్ ఇది

మలయాళంలో విజయవంతమైన'దృశ్యమ్‌' ఆధారంగా రూపొందిన సినిమా ఇది. మోహన్ లాల్,మీనా నటించిన చిత్రం అక్కడ సూపర్ హిట్ అయ్యింది

వాస్తవకతకు దగ్గరగా

వాస్తవకతకు దగ్గరగా

వెంకటేష్‌ తొలిసారి ఇద్దరి పిల్లలకు తండ్రిగా, మధ్య వయస్కుడి పాత్రలో కనిపిస్తారు. పూర్తి వాస్తవికతకు దగ్గరగా ఈ పాత్రను డిజైన్ చేసారని సమాచారం.

ట్యాగ్ లైన్

ట్యాగ్ లైన్

కళ్లతో చూసినవన్నీ నిజాలు కాదు అన్న విషయాన్ని ఇందులో ఎలా నిరూపించారన్నది ఆసక్తికరం. దాన్నే ట్యాగ్ లైన్ గా ఈ చిత్రానికి ఫిక్స్ చేసారు

కుటుంబాలే టార్గెట్

కుటుంబాలే టార్గెట్

ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఇంటిల్లిపాదినీ అలరించేలా ప్లాన్ చేస్తున్నారు. కుటుంబాలు చూసి మెచ్చుకోవాలనే ఈ సినిమా లక్ష్యం గా చెప్తున్నారు.

లొకేషన్స్..

లొకేషన్స్..

అరకు, విజయనగరం, విశాఖపట్నం, హైదరాబాద్‌, కేరళ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు.

రిలీజ్

రిలీజ్

వచ్చే నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాతలు చెప్తున్నారు. ఈ లోగా చిత్రం ఆడియో విడుదల అవుతుంది.

తెర ముందు..

తెర ముందు..

వెంకటేష్, మీనా, ఎస్తర్‌, కృతిక, నదియా, చైతన్యకృష్ణ, నరేష్‌, రవి కాలే, పరుచూరి వెంకటేశ్వరరావు, సమీర్‌, సప్తగిరి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తెర వెనక

తెర వెనక

ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎస్‌.గోపాల్‌ రెడ్డి, సంగీతం: శరత్‌, కథ: జీతూ జోసెఫ్‌, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, రచన: పరుచూరి బ్రదర్స్‌

English summary
Venkatesh's Malayalam Super Hit Remake, Drushyam will release on August 15. The film is now progressing in Araku, Vizag District. Venky, Meena, Ravi Kale, Chalapathi Rao and etc., are participating in ongoing schedule.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu