»   »  మరో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్న వెంకటేష్

మరో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్న వెంకటేష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సీనియర్ హీరో వెంకటేష్ తన వయసుకు తగిన పాత్రలు ఎంచుకుంటూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇతర భాషల్లో తనకు సెట్టయ్యే సినిమాలు ఉంటే రీమేక్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే హిందీలో హిట్టయిన ‘ఓ మై గాడ్' చిత్రాన్ని తెలుగులో ‘గోపాల గోపాల'గా, మళయాలం హిట్ మూవీని తెలుగులో దృశ్యంగా రీమేక్ చేసి సక్సెస్ అయ్యారు.

తాజాగా వెంకటేష్ మరో సినిమాపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మాధవన్ హీరోగా తెరకెక్కుతున్న హిందీ చిత్రం ‘సాలాఖద్దూస్' చిత్రంపై ఆయన ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. సుధా కొంగర ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ చిత్రంలో మాధవన్ రిటైర్డ్ బాక్సర్ గా నటిస్తున్నారు. తనకు ఉన్న అనుభవంతో మంచి బాక్సార్ ను తయారు చేసే క్యారెక్టర్లో ఆయన కనిపిస్తారు.

ఈ చిత్రం విడుదలై హిట్టయితే...వెంకటేష్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. సినిమా విడుదల తర్వాత వెంకటేష్ ఈ సినిమా చేయాలా? వద్దా అనే దానిపై ఓ నిర్ణయానికి రాబోతున్నాడు.

సాలా ఖద్దూస్ తెలుగు వెర్షన్ త్వరలో రాబోతోందని దర్శకుడు సుధా కొంగర ప్రసాద్ ఆల్రెడీ ప్రకటించారు. అయితే హీరోగా ఎవరు చేస్తున్నారనే విషయం మాత్రం ఆయన ఇంకా ప్రకటించలేదు. వెంకటేష్ నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే అఫీషియల్ ప్రకటన రానుంది.

Venkatesh eye on Saala Khadoos

దృశ్యం' తర్వత మరే సినిమా చెయ్యలేదు. ప్రస్తుతం మారుతి డైరక్షన్ లో 'బాబు బంగారం' (వర్కంగ్ టైటిల్) సినిమా చేస్తున్నారు వెంకటేష్. ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా, స్పీడ్ గా సాగిపోతోంది. అదే విధంగా బిజినెస్ సైతం చాలా ఊపుగా , స్పీడుగా ,సైలెంట్ గా జరుగుపోతోందని సమాచారం.

నయనతార లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా మంచి హిట్ అవుతుందని, గతంలో వెంకటేష్, నయనతారా కాంబినేషన్ లో వచ్చిన లక్ష్మి, తులసి సినిమాలు సూపరు హిట్ అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే మంచి హిట్స్ తో ముందుకు దూసుకుపోతున్న డైరక్టర్ మారుతి ఈ ఫ్యామిలి సినిమాతో ఏ రేంజిలో మాయా చెస్తాడో అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. . ఎస్‌. రాధాకృష్ణ సమర్పణలో సితార ఎంటర్‌టైనమెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

English summary
Director Sudha Kongara Prasad says the Telugu version of forthcoming Hindi-Tamil sports drama 'Saala Khadoos' is on the cards and she would love to direct the project. While Sudha hasn't revealed the name of the actor yet, it is learnt from a source that actor Venkatesh is really excited about the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu