»   »  వెంకీ టైటిల్ మారింది

వెంకీ టైటిల్ మారింది

Posted By:
Subscribe to Filmibeat Telugu
Venkatesh
'గమ్యం తో పాపులర్ అయిన క్రిష్ (రాధా కృష్ణ)...విక్టరీ వెంకటేష్‌ కాంబినేషన్ లో అగ్ర నిర్మాత అశ్వనీదత్ ఒక చిత్రం నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాకు "జయకృష్ణా ముకుందా మురారీ" అనే టైటిల్ మొదట బయిటకు వచ్చింది. కానీ ఇప్పుడా టైటిల్ మార్చినట్లు తెలుస్తోంది. దాని పేరు 'కృష్ణం వందే జగద్గురం' .దీన్ని వెంకీనే సూచించాడని తెలుస్తోంది. అయితే ఈ టైటిల్ కూడా మారే అవకాశం ఉందంటున్నారు.

ఇక ఈ చిత్ర కథ చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వినోదం పంచుతూనే , కొంత ఫిలాసఫీ కూడా ఈ సినిమాలో చోటు చేసుకుంటుందని తెలియవచ్చింది. ఇప్పటికే సిద్ధమైన ఈ సినిమా స్క్రిప్టుకు క్రిష్ మరింత మెరుగులు దిద్దుతున్నాడు. గమ్యంకు మాటలు రాసిన నాగరాజే దీనికీ డైలాగులు వ్రాయనున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ ఇంతదాకా కనుపించని వైవిధ్యమైన పాత్రలో ప్రెష్ లుక్ తో కనిపించనున్నాడు.

ఆయన సరసన ఒక కొత్త అమ్మాయిని పరిచయం చేయాలని క్రిష్ భావిస్తున్నాడు. సెర్చింగ్ మొదలైంది. వెంకటేష్ ప్రస్తుతం "చింతకాయల రవి.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్"గా నటిస్తున్నారు. యోగి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుష్క, మమతా మోహన్‌దాస్ హీరోయిన్లు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X