Just In
- 1 hr ago
తొలిసారి వెనక్కి తగ్గిన రాంగోపాల్ వర్మ.. ఆ సీన్లు లేకుండానే సినిమా.. హల్చల్ చేస్తోన్న ఫొటో.!
- 2 hrs ago
కోటి రూపాయల విరాళం.. అది నాకు గర్వకారణం.. పవన్ కళ్యాణ్‌పై ప్రశంసలు
- 2 hrs ago
షాకింగ్: పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన పూనమ్ కౌర్.. సంచలన వ్యాఖ్యలతో ట్వీట్.!
- 3 hrs ago
కేజీఎఫ్ ఖాతాలో మరో రికార్డు.. ఏ హీరోకు దక్కన్నట్లుగా.. సోషల్ మీడియాలో వైరల్
Don't Miss!
- News
ఆంగ్లో ఇండియన్లు వద్దట.. థర్డ్ జెండర్ కావాలట.. ప్రధాని మోడీకి రేవంత్ లేఖ, అందుకే లేఖనా...?
- Sports
లవ్ ద డైలాగ్ సర్: 'నోట్‌బుక్' సెలబ్రేషన్‌పై అమితాబ్ ట్వీట్‌కు విరాట్ కోహ్లీ
- Lifestyle
ప్రతి రాత్రి నిద్రించే ముందు నిమ్మ మరియు తేనె మిశ్రమ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు!
- Technology
హువాయి బ్యాండ్ 4 ప్రో రిలీజ్... దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూడండి
- Finance
జీఎస్టీ స్లాబ్ 5 నుంచి 6 శాతానికి పెంచే ఛాన్స్, స్వల్పంగా పెరగనున్న ధరలు
- Automobiles
డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
స్టేజ్‌పై వెంకీ ఫన్నీ స్పీచ్.. అన్నయ్య పైనే సెటైర్.. పగలబడి నవ్విన సురేష్ బాబు
వెంకీమామ అంటూ అల్లుడు నాగ చైతన్య, మామ విక్టరీ వెంకటేష్ కలిసి వస్తుండగా.. ఇంకో మామ సురేష్ బాబు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. టీజర్, పోస్టర్స్, పాటలతో సందడి చేసిన వెంకీమామ.. సస్పెన్స్ థ్రిల్లర్‌లా రిలీజ్ డేట్‌ను మాత్రం చివరి వరకు అనౌన్స్ చేయకుండా వచ్చారు. ఇదే విషయాన్ని వేదికపైనే వెంకీ కాస్త ఫన్నీగా తనదైన శైలిలో చెప్పేసి.. సురేష్ బాబుకు సెటైర్ వేశాడు. దీంతో ఆయన కూడా పగలబడి నవ్వేశాడు. డిసెంబర్ 13న వెంకీమామ రాబోతోందని ప్రకటించిన చిత్రయూనిట్.. ఆ మీడియా సమావేశంలో అనేక విషయాలను వెల్లడించింది.

ఎంతో నేర్చుకున్నాను..
డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ.. ఈ మూవీ కోసం తాను చాల కష్టపడ్డాడని, ఈ కథలో జెన్యూనిటీ ఉందని ఆయన అన్నాడు. ప్రతీరోజూ సురేష్ బాబు కథ, కథనాలకు సంబంధించి సూచనలు ఇవ్వడం, ఆయనతో కలిసి ప్రయాణం చేయడంతో ఎంతో నేర్చుకున్నానని తెలిపాడు. వెంకటేష్ కామెడీ టైమింగ్ గురించి అందరికీ తెలిసిందే.. ఈ సినిమాలోనూ ఆయన అద్భుతంగా నటించారు. నాగ చైతన్య సైతం ఎమోషనల్ సీన్స్‌లో చక్కగా నటించారు. కొత్త చైతును చూస్తారని పేర్కొన్నాడు. చైతు పాత్ర బాగా రావాలని వెంకటేష్, తన మామ పాత్ర బాగుండాలని చైతు ఇద్దరూ కోరుకున్నారని అన్నాడు.

ప్రకాష్ రాజ్ అంటే భయపడ్డా..
సురేష్ బాబు మాట్లాడుతూ.. ఈ మూవీ కోసం మొదటగా ఎవరెవరినో అనుకున్నాము.. చివరకు వేరే వాళ్లు వచ్చారు.. అంతా చివరి నిమిషంలో ఓకే అయిందని చెప్పుకొచ్చాడు. ఈ మూవీలోని ఓ పాత్రకు ప్రకాష్ రాజ్ కావాలని డైరెక్టర్ అడిగాడని, ఆయనతో గొడవెందుకు అని తాను అన్నట్లు తెలిపాడు. అయినా సరే అతనే కావాలని దర్శకుడు అడిగాడని, అటుపై ఆ పాత్రకు ఆయన్ను తీసుకున్నామని చెప్పుకొచ్చాడు. కానీ ఆయన ఏ రోజు ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని, సమయానికి వచ్చేవాడు, తన పనేదో తాను చూసుకునేవాడని, ఆ పాత్రకు ఆయనే కరెక్ట్ అని ఆ క్యారెక్టర్‌ను చేసినందుకు ప్రకాష్ రాజ్‌కు ధన్యవాదాలు తెలిపాడు. ఇంకా మిగతా నటీనటుల గురించి మాట్లాడుతూ అందరికీ థ్యాంక్స్ అని చెప్పాడు.

నా కెరీర్‌లో రెండే చిత్రాలు..
నాగ చైతన్య మాట్లాడుతూ.. తాను ఎన్ని సినిమాలు చేసినా తన లైఫ్‌లో గుర్తుండేవి రెండే చిత్రాలని అవి మనం, వెంకీమామ అని చెప్పుకొచ్చాడు. ఇవి రెండూ తన కుటుంబాలతో కలసి చేశానని, ఆ మెమోరీస్ ఎప్పటికీ అలానే ఉండిపోతాయని తెలిపాడు. ఈ చిత్రం అందరికీ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుందని, అందరికీ నచ్చుతుందని అన్నాడు.

ఫన్నీ స్పీచ్‌తో నవ్వించిన వెంకీ
వెంకటేష్ మాట్లాడుతూ.. ‘దేవుడా.. ఓ మంచి దేవుడా.. చాలా థ్యాంక్స్ దేవుడా.. ఫైనల్ గా డిసెంబర్ 13న సినిమా వస్తోంది. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను దేవుడా.. ఎప్పుడూ ఇంత టెన్షన్ లేదు. వెంకీ మామ అన్నారు.. మిలట్రీ నాయుడు అన్నారు... రిలీజ్ కు మాత్రం చాలా రోజులు తీసుకున్నారు. థ్యాంక్యూ సురేష్ ప్రొడక్షన్స్, థ్యాంక్యూ అన్నయ్య' అంటూ ప్రత్యేకమైన యాసలో మాట్లాడి అందర్నీ నవ్వించాడు. ఇక డైరెక్ట్‌గా తన అన్నయ్య, సురేష్ ప్రొడక్షన్స్‌పైనే వెంకీ సెటైర్ వేసేసరికి వేదిక కింద కూర్చున్న సురేష్ బాబు సైతం పగలబడి నవ్వేశాడు.