»   » వెంకటేష్ ఆ చిత్రం ఆగిపోయినట్లేనా?

వెంకటేష్ ఆ చిత్రం ఆగిపోయినట్లేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

వెంకటేష్ ఆ మధ్య తాను 'గంగ'..ది డాన్ చిత్రం చేయనున్నట్లు ప్రకటించాడు. అయితే ఇప్పుడా చిత్రం మెటీరియలైజ్ కావటం లేదని సమాచారం. అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్నీ చేయాలని నిర్మాత నల్లమలుపు బుజ్జి,సురేష్ బాబు ప్రయత్నించారు. అయితే ఇప్పుడా చిత్రం ఆగిపోయినట్లేనని తెలుస్తోంది. కోన వెంకట్ స్క్రిప్టు తయారు చేసిన ఈ చిత్రంలో వెంకటేష్ డాన్ గా చేస్తాడని, కథనం కామిడిగా సాగుతుందని వినపడింది. అలాగే ఈ చిత్రం కోసం ఆ మధ్య ఇంటి సెట్ కూడా వెయ్యటానికి ప్రయత్నాలు జరిగాయి. అయితే కథ సరిగ్గా కుదరక పోవటంతో ఈ చిత్రం చేయటానికి నిర్మాత వెనకడుగు వేసారని తెలుస్తోంది. అందులోనూ అమ్మ రాజశేఖర్ గతంలో రణం కాకుండా ఒక్క హిట్ సినిమా కూడా ఇవ్వకపోవటం కూడా ఈ ప్రాజెక్టుపై నమ్మకం సడిలేలా చేసిందని చెప్తున్నారు. మరో ప్రక్క ఆప్త రక్షక చిత్రం రీమేక్ చేయటానికి వెంకటేష్ ముందుకురావటంతో ఈ ప్రాజెక్టుని పూర్తిగా మూలన పెట్టేసారు. అయినా ఎంతో నమ్మకాలు పెట్టుకున్న నమో వెంకటేశ చిత్రం భాక్సాఫీస్ వద్ద చీదటం కూడా ఈ గంగ పై ఎఫెక్టు చూపిందంటున్నారు.ఇక వెంకటేష్ ప్రస్తుతం బాడీ గార్డ్ రీమేక్ పై కూడా ఆసక్తి చూపుతున్నాడని సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu