బరువు పెరుగుతున్న వెంకటేష్
హైదరాబాద్ : వెంకటేష్ మరో రీమేక్ చిత్రంలో నటించబోతున్నారు . మాధవన్ హీరోగా హిందీలో తెరకెక్కిన 'సాలా ఖదూస్'పై వెంకీ మనసు పడ్డారు. అందుకోసం ఆయన బాడీని పెంచుతున్నారు. సాధారణంగా నటులు బరువు పెరగటానికి ఇష్టపడరు. కానీ వెంకటేష్ మాత్రం ఈ పాత్రకు న్యాయం చేయాలని బరువు పెరుగుతున్నరు.
ఒక బాక్సర్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. కొద్ది రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రంలో మాధవన్ ఓ బాక్సర్‌గా, బాక్సింగ్ కోచ్‌గా కనిపిస్తాడు. చిత్రాన్ని చూసిన వెంకీ తెలుగులో తాను చేయాలని నిర్ణయించుకొన్నారని సమాచారం. తెలుగమ్మాయైన సుధ కొంగర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు చిత్రానికి ఆమే దర్శకత్వం వహిస్తారని తెలిసింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.

దృశ్యం' తర్వత మరే సినిమా చెయ్యలేదు. ప్రస్తుతం మారుతి డైరక్షన్ లో 'బాబు బంగారం' (వర్కంగ్ టైటిల్) సినిమా చేస్తున్నారు వెంకటేష్. ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా, స్పీడ్ గా సాగిపోతోంది. అదే విధంగా బిజినెస్ సైతం చాలా ఊపుగా , స్పీడుగా ,సైలెంట్ గా జరుగుపోతోందని సమాచారం.
నయనతార లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా మంచి హిట్ అవుతుందని, గతంలో వెంకటేష్, నయనతారా కాంబినేషన్ లో వచ్చిన లక్ష్మి, తులసి సినిమాలు సూపరు హిట్ అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
ఇప్పటికే మంచి హిట్స్ తో ముందుకు దూసుకుపోతున్న డైరక్టర్ మారుతి ఈ ఫ్యామిలి సినిమాతో ఏ రేంజిలో మాయా చెస్తాడో అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. . ఎస్. రాధాకృష్ణ సమర్పణలో సితార ఎంటర్‌టైనమెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











