»   » కథ ఇదీ.., వెంకీ ఇలా ఉన్నాడు :దీపావళి పోస్టర్ విడుదల

కథ ఇదీ.., వెంకీ ఇలా ఉన్నాడు :దీపావళి పోస్టర్ విడుదల

Posted By:
Subscribe to Filmibeat Telugu

గురు అనగానే ఒక నోస్టాల్జిక్ ఫీల్ కనిపిస్తుంది నటుడు కమల్ హాసన్ ఇదే తైటిల్ తో చేసిన సినిమా ఆ టైటిల్ వేసిన ప్రభావం ఇంకా జనాల్లో అలానే ఉంది. అలాంటి పవర్ ఫుల్ టైటిల్ తో మళ్లీ మరో సారి వెంకటేష్ రానున్న సంగతి తెలిసిందే "ఇరిధిసుట్రు" అనే తమిళ సినిమా ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. దాదాపుగా ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అన్న ఫీలింగ్ లోనే ఉన్నారు యూనిట్ మొత్తం ఎందుకంటే అటు బాలీవుడ్ లోనూ, ఇటు కోలీవుడ్ లోనూ చెప్పుకోదగ్గ విజయాన్ని నమోదు చేసిన కథే కావటం, వెంకటేష్ ఇలాంటి పాత్రకోసమే అన్నట్టు సూట్ అవటం ఈ రెండు అంశాలూ సినిమా మీద మంచి అంచనాలనే కలిగించేవిగా ఉన్నాయి.

హిందీ సినిమా సాలా ఖండూస్ కు ఇదే మాతృక. అయితే హిందీ సినిమాలో కొన్ని మార్పులు చేసారు. ఆ మార్పులు లేకుండా తమిళ మాతృకనే తెలుగులోకి తీసుకువస్తున్నారు. బాలీవుడ్ సినిమాలో హీరోయిన్ గా నటించిన రీతికా సింగ్ నే తెలుగులో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే వెంకటేష్ సగానికంటే ఎక్కువే మార్కులు వేసుకున్నాడు. ఈ దీపావళికి టీజర్ వస్తుందేమో అనుకున్నా పోస్టర్ తోనే సరిపెట్టారు. అయితే ఈ పోస్టర్ కూడా ఏమాత్రం తగ్గలేదు... అసలు వెంకటేష్ ఇలాకూడా కనిపించగలడా అన్నట్టుగా కనిపిస్తోంది... ఈ సినిమా గురించిన వ్శేషాలు..


గురు:

గురు:

బాలీవుడ్‌లో మాధవన్‌ హీరోగా విడుదలైన చిత్రం ‘సాలా ఖాడూస్‌'. బాక్సింగ్‌ కోచ్‌గా మధవన్‌ నటించిన ఈ చిత్రం చక్కటి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను తెలుగులో ‘గురు'గా రీమేక్‌ చేస్తున్నాడు విక్టరీ వెంకటేష్‌. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ ఇదివరకే విడుదలవగా.. ఇప్పుడు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ మరో పోస్టర్‌ రిలీజైంది.


ఓ బాక్సర్‌ జీవిత కథ:

ఓ బాక్సర్‌ జీవిత కథ:

బాక్సింగ్‌ కోచ్‌ అయిన వెంకటేష్‌ తన శిష్యురాలితో బైక్‌పై వెళ్తున్న స్టిల్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్‌. ఓ బాక్సర్‌ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహిస్తుండగా.. హిందీ వెర్షన్‌లో నటించిన రితికా సింగే ఈ సినిమాలోనూ హీరోయిన్‌ పాత్ర పోషిస్తోంది.


భారత మహిళా బాక్సింగ్‌ :

భారత మహిళా బాక్సింగ్‌ :

మంచి నైపుణ్యమున్న బాక్సింగ్‌ క్రీడాకారుడు తన కోచ్‌ ఇంకా మరికొందరి కుట్ర.. మోసం కారణంగా.. భారత్‌కు బాక్సింగ్‌లో స్వర్ణం సాధించాలన్న అతని లక్ష్యం త్రుటిలో చేజారుతుంది. దీంతో తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనవుతాడు. ఆ పై కొందరు శ్రేయోభిలాషుల జోక్యంతో.. అంతగా పేరులేని భారత మహిళా బాక్సింగ్‌ జట్టుకు కోచ్‌గా వెళ్తాడు.


తాను సాధించలేకపోయిన లక్ష్యాన్ని:

తాను సాధించలేకపోయిన లక్ష్యాన్ని:

అయితే అక్కడకూడా అక్కడి స్వార్థ రాజకీయాల కారణంగా.. బదిలీపై చెన్నై (తెలుగులో వైజాగ్ అట) వెళ్తాడు. తాను సాధించలేకపోయిన లక్ష్యాన్ని.. తన శిష్యురాళ్లు సాధించాలన్న కసితో.. అందుకు తగిన అమ్మాయి కోసం ఆది వెతుకుతున్నప్పుడు.. చేపలు పట్టే కుటుంబానికి చెందిన "మది" (రితికా సింగ్‌ చేసిన పాత్ర) అనే యువతి కనబడుతుంది.


ఎలాగైనా పోలీసు ఉద్యోగం సంపాదించాలని:

ఎలాగైనా పోలీసు ఉద్యోగం సంపాదించాలని:

బాక్సింగ్‌ క్రీడ ప్రముఖుడు మహమ్మద్‌ అలీని ఎంతో అభిమానించే మదిలో బాక్సింగ్‌ క్రీడాకారిణికి ఉండాల్సిన శక్తియుక్తులు.. చురుకుదనం ఉన్నాయని గుర్తించిన ఇతను... ఆమెను తన శిష్యురాలిగా చేసుకుని.. శిక్షణ ఇస్తుంటాడు. రోజుకు రూ. 500 చొప్పున ఆమెకు చెల్లించేలా ఒప్పందం చేసుకుని. బాక్సింగ్‌ సాధన చేయిస్తుంటాడు ఈ "గురు"ఇదే సమయంలో మది అక్క లక్ష్మి వురఫ్‌ లక్స్‌(ముంతాజ్‌ సర్కార్‌ చేసిందీ పాత్ర ) కుటుంబపోషణ కోసం ఎలాగైనా పోలీసు ఉద్యోగం సంపాదించాలని.. బాక్సింగ్‌ సాధన చేస్తుంటుంది. చెల్లెలు మది పట్ల కోచ్‌ ఆది చూపే ప్రేమ.. అభిమానంతో అసూయకు గురైన లక్స్‌ ఆమె ఒక మేజర్‌ మ్యాచ్‌లో పాల్గొనకుండా చేస్తుంది!


గురు మాత్రమే చెప్పగలడు:

గురు మాత్రమే చెప్పగలడు:

ఈ విషయాలేవీ తెలియని ఆది మదిపై మండిపడతాడు. నీకిక శిక్షణ ఇవ్వను పో..! అంటూ బయటకు పంపేస్తాడు. ఆపై జరిగే పరిణామాల్లో రితికా సింగ్ పాత్ర జైలుపాలవుతుంది. ప్రపంచమంతా మెచ్చుకునే స్థాయి బాక్సర్‌ అవ్వాలని కలలుగన్న ఆమె ఇలా అర్థంతరంగా ఎందుకు జైలుపాలైంది? ఆమెపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్న కోచ్‌ ఆది చివరకు తన లక్ష్యాన్ని సాధించాడా? అనే ప్రశ్నలకు సమాధానాలు "సాలా ఖడూస్" ఉరఫ్ గురు మాత్రమే చెప్పగలడు.


విమర్శకుల ప్రశంసలు:

విమర్శకుల ప్రశంసలు:

బాక్సింగ్ పట్ల మహిళల దృక్పథం మారలాన్న యాంగిల్ లో స్టొరీ ని రన్ చేశారు. ఎందుకంటే 2006 తర్వాత బాక్సింగ్ లో ఇంతవరకూ మనకి వరల్డ్ ఛాంపియన్ షిప్ రాలేదు. స్టొరీ కొన్నిచోట్ల గ్రిప్పింగ్ గా అనిపించినా, ఓవరాల్ గా ఇంప్రెసివ్ గా లేదు అన్న రిపోర్ట్ హిందీ లో ఉంది అయితే మాధవన్, రితికా ల యాక్టింగ్, సుధా కొంగర డైరెక్టింగ్ స్కిల్స్ వల్ల ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవటమే కాదు విమర్శకుల ప్రశంసలని అందుకుంది.


సంక్రాంతికి విడుదల:

సంక్రాంతికి విడుదల:

ఈ కథ తమిళ .. హిందీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా రీమేక్ పట్ల వెంకటేశ్ ఆసక్తిని చూపించినప్పుడే కథలో విషయం వుండి ఉంటుందని అనుకున్నారు. ఫస్టు లుక్ పోస్టర్ చూశాక, తాము ఊహించింది నిజమేనని చెప్పుకుంటున్నారు. సినిమాను సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో వున్నారు.


కసిగా ఉన్నాడు:

కసిగా ఉన్నాడు:

వెంకటేష్' ఎంతో ఊహించుకున్న 'బాబు బంగారం' తీవ్రంగా నిరాశపరిచింది. ఈ చిత్రం బడ్జెట్ ని రాబట్టగలిగింది కానీ ఈ చిత్రం వల్ల 'వెంకటేష్' కి ప్రత్యేకంగా ఒరిగింది మాత్రం ఏం లేదని చెప్పాలి. అందుకే 'గురు' రీమేక్ తో అయినా బాక్సాఫీసు వద్ద విక్టరీ నమోదు చేయాలని కసిగా ఉన్నాడు. ఈ చిత్రం ఒపెనింగ్ రోజే 'వెంకీ' ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి మూవీపై అంచనాలు పెంచారు.


వెరైటీగా ఉన్నాడు:

వెరైటీగా ఉన్నాడు:

పోస్టర్ లో హీరో బుల్లెట్ పై వెళుతుంటాడు. వెనక శిష్యురాలు రితికా సింగ్ ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ లో ఢిల్లీ ఉంటుంది. శిష్యురాలికి బాక్సింగ్ విజేతగా నిలపటానికి తపన పడే ఓ ట్రైనర్ వెంకీ పర్ ఫెక్ట్ గా ఉన్నాడనే ఇప్పటికే టాలీవుడ్ టాక్. ఫస్ట్ అండ్ దివాలీ లుక్స్ చూస్తే.. మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి. మాస్ అండ్ క్లాస్ గా వెంకటేష్ కనిపిస్తున్నాడు. కళ్లద్దాలు, టోపీ, కండలు కనిపించే విధంగా షర్ట్ లతో విక్టరీ వెరైటీగా ఉన్నాడు. గురు మూవీ హిట్ గ్యారంటీ అనే టాక్ ఇప్పటికే టాలీవుడ్ లో నడుస్తోంది.


English summary
The Diwali look new poster of Victory Venkatesh from his upcoming film Guru has been unveiled on eve of Diwali.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu