»   »  సురేంద్రరెడ్డి దర్శకత్వంలో వెంకటేష్?

సురేంద్రరెడ్డి దర్శకత్వంలో వెంకటేష్?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Surender Reddy
అతనొక్కడే సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన దర్శకుడు సురేంద్ర రెడ్డి. తరువాత అతను చేసిన అశోక్, అతిథి టెక్నికల్ గా మంచి దర్శకుడు అన్న పేరు తెచ్చిపెట్టాయి. కాని పెద్దగా వర్కవుట్ కాలేదు. ఈ పరాజయం ప్రభావంతో ముందున్న క్రేజ్ తగ్గిపోయింది. దాంతో పెద్ద హీరోల డేట్స్ దొరకలేదు. డైలమాలో పడ్డాడు సురేంద్రరెడ్డి కాని తాజాగా అతను చెప్పిన సబ్జెక్టుకు వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించే ఈ చిత్రానికి నల్లమలుపు బుజ్జి ప్రొడక్షన్ పార్టనర్ గా చేస్తారని వ్యవహరిస్తారట.

సురేంద్రరెడ్డి ప్రస్తుతం డైలాగ్ కింగ్ సాయికుమార్ కుమారుడు ఆదిత్యని హీరోగా పరిచయం చేయటానికి సన్నాహాలు చేస్తున్నాడు. సినిమా పేరు 'మొదటివాడు'. అదో భారీ యాక్షన్ సినిమాట. జూన్ 1 నుంచి ఈ సినిమా ప్రారంభమవుతంది. మరో ప్రక్క వెంకటేష్ 'చింతకాయల రవి' లో బిజీగా ఉన్నాడు. సురేంద్రరెడ్డి సినిమా పూర్తయ్యేసరికల్లా వెంకటేష్ రిలీజయ్యి రిలాక్స్ మూడ్ లో ఉండాలని భావిస్తున్నాడుట. సెప్టెంబర్ లో ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉందిట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X