»   »  ఫ్లాఫ్ బ్యాచ్ తో వెంకీ ప్రయోగం

ఫ్లాఫ్ బ్యాచ్ తో వెంకీ ప్రయోగం

Posted By:
Subscribe to Filmibeat Telugu
Venkatesh
అక్టోబర్ ఒకటవ తేదీన రిలీజ్ కానున్న చింతకాయల రవి సినిమాపై ట్రేడ్ లో మంచి అంచనాలే ఉన్నాయి. అలాగే ఆడియో రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకోవటంతో యూనిట్ కూడా మంచి ఉషారులో ఉన్నారు. అయితే ఈ సినిమా విషయంలో ఓ విశేషం ఉంది. అది ఈ సినిమా లీడ్ పర్శన్స్ లో ఎక్కువ మంది ఫ్లాపుల్లో ఉన్నవారు కావటం . ఒక రాజు ఒక రాణి చిత్రంతో మెగా ఫ్లాఫ్ ఇచ్చిన యోగి ఈ చిత్ర దర్శకుడు.

అలాగే రీసెంట్ గా రిలీజై ఫ్లాఫ్ టాక్ తెచ్చుకున్న బలాదూర్ హీరోయిన్ అనూష్క మెయిన్ హీరోయిన్. సెకెండ్ హీరోయిన్ ... విక్టరీ, హోమం వంటి ఫ్లాపుల మమతా మోహన్ దాస్. ఇక ఐటం సాంగ్ చేయబోయే ఆర్తి ఛాబ్రియా...ఒకరికి ఒకరు, ఇంట్లో శ్రీమతి..వీధిలో కుమారి వంటి ఫ్లాఫ్ చిత్రాల హీరోయిన్. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టవుతుంది. అయితే ఈ సినిమా కున్న పెద్ద ప్లస్ వెంకటేష్. వరస హిట్లతో దూసుకెళ్తున్న ఈయన వీరందరినీ తన టీమ్ లోకి తీసుకోవటం గొప్ప విషయం అయితే త్వరలోనే ఈ సినిమా తో హిట్టిచ్చి వీరిందరికీ లైఫ్ ఇవ్వబోవటం మరో బోనస్ .బెస్టాఫ్ లక్ వెంకీ

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X