»   » అవి జస్ట్ రూమర్స్ అంతే...వెంకటేష్

అవి జస్ట్ రూమర్స్ అంతే...వెంకటేష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రూమర్స్ అంటే రూమర్సే...అవి అలాగే ఉంటాయి. మనం ఎంతవరకూ నమ్మామన్నదే ఇక్కడ ముఖ్యం అంటున్నారు వెంకటేష్. ఆయన తాజాగా చేస్తున్న ఆప్త మిత్ర రీమేక్ షూటింగ్ లో భాగంగా విజయనగరంలో కలిసిన మీడియాతో ఇలా సెలవిచ్చారు. ఆ చిత్రంలో చేయనంటూ చంద్రముఖి దెయ్యం వస్తుందని రజనీకాంత్ యజ్ఞం చేసారు కదా..అందులోనూ సౌందర్య, విష్ణువర్ధన్ చనిపోయారు కదా అంటే నవ్వి అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేసారు. ఇక ఈ చిత్రంలో వెంకటేష్ ఓ సైకాలజిస్టు గా చేస్తున్నారు. అలాగే వెంకటేష్ మొట్ట మొదటి సూపర్ న్యాచురల్ ధ్రిల్లర్ ఇది.

వెంకటేష్ చేసిన దాదాపు అరవై చిత్రాల్లో ఇదే కొద్దిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కావటం విశేషం. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన అనూష్క మెయిన్ హీరోయిన్ గా చేస్తోంది. అలాగే రిచా ఉపాధ్యాయ, కమిలినీ ముఖర్జీ, శ్రద్ధాదాస్ తదితరులు హీరోయిన్స్ గా చేస్తున్నారు. పి.వాసు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. బెల్లంకొండ సురేష్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఇక వెంకటేష్, శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన నమో వెంకటేశ చిత్రం ప్లాఫ్ కావటంతో ఈ చిత్రం చాలా జాగ్రత్తలు తీసుకుని చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ పీరియాడిక్ ధ్రిల్లర్ లో వెంకటేష్ వృధ్దుడు గెటప్ లో కూడా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి మూలమైన కన్నడ ఆప్త రక్షక లో విష్ణు వర్దన్ ఆ పాత్రను పోషించాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu