»   » హోం మినిస్టర్‌గా వెంకటేష్, ఈ నెల 6న ముహూర్తం

హోం మినిస్టర్‌గా వెంకటేష్, ఈ నెల 6న ముహూర్తం

Posted By:
Subscribe to Filmibeat Telugu
Venkatesh - Nayantara
హైదరాబాద్: లక్ష్మి, తులసి లాంటి బ్లాక్ బస్ట్ హిట్ చిత్రాల తరువాత హ్యాట్రిక్ కాంబినేషన్ తో విక్టరీ వెంకటేష్, నయనతారలు జంటగా దర్శుకడు మారుతి దర్శకత్వంలో నిర్మాత డివివి దానయ్య యూనివర్సల్ మీడియా పతాకంపై తెరకెక్కిస్తున్న చిత్రం 'రాధా'. డి. పార్వతి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు ఫిబ్రవరి 6న నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత దానయ్య మాట్లాడుతూ 2013లో మా బేనర్లో నాయక్ లాంటి హిట్ చిత్రాన్ని అందించారు. ఇపుడు వెంకటేష్ తో 'రాధా' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. మారుతి చెప్పిన కథ, కథనం బాగా నచ్చడంతో నయనతార 30 నిమిషాల్లో డేట్స్ ఇచ్చారు అన్నారు.

ఇందులో వెంకటేష్ హోం మినిస్టర్‌గా, నయనతార మధ్య తరగతి అమ్మాయిగా నటిస్తుంది. వీరి మధ్య సాగే ప్రేమకథతోనే ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము. ఈ చిత్రం ప్రస్తుత ట్రెండుకు తగిన విధంగా ఉంటుంది. ఫిబ్రవరి 6వ తేదీన పూజా కార్యక్రమాలతో 'రాధా' షూటింగ్ ప్రారంభిస్తున్నాం' అన్నారు.

వరుస హిట్ చిత్రాల దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సనిమా కావడం, వెంకీ-నయనతార లాంటి హిట్ కాంబినేషన్ కావడంతో ఈచిత్రంపై మంచి అంచనాలున్నాయి. ఈచిత్రానికి సమర్పకులు : డి. పార్వతి, సంగీతం: జె.బి, సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్, ఎడిటింగ్: ఉద్ధవ్, నిర్మాత : డివివి దానయ్య, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: మారుతి.

English summary

 Venkatesh, Maruthi's Radha to be launched on Feb 6. Venkatesh will be seen as a Home Minister. Nayanthara is pairing up with Venkatesh once again in this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu