»   » వెంకటేష్ తెగ పొగిడేస్తున్నాడు...కన్నేసాడా?

వెంకటేష్ తెగ పొగిడేస్తున్నాడు...కన్నేసాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సీనియర్ హీరో వెంకటేష్ తాజాగా తను వెడ్స్ మను-2 (సీక్వెల్) చిత్రం చూసారు. దాంతో ఈ చిత్రంపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఆయన ట్వీట్ చేస్తూ...అద్బుతమైన కమ్ బ్యాక్ అంటూ పొగిడారు. ఆ ట్వీట్ చూసిన వారు వెంకటేష్ ఆ రీమేక్ కొని చేసే ఆలోచనలో ఉన్నారేమో అంటున్నారు. ఆయన ఏమని ట్వీట్ చేసారంటే...

చిత్రం కథేమిటంటే...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మొదటి సినిమా కథ మళ్లీ ఒక సారి గుర్తు చేసుకుంటే..... లండన్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్నా సంప్రదాయాలను గౌరవించే మనోజ్‌ శర్మ(మను)గా మాధవన్‌, మగరాయుడిలాంటి అల్లరి అమ్మాయి తనూజ త్రివేది(తను)గా కంగనా పెళ్లికు చెందిన కథ ఇది. విభిన్న ధ్రువాల్లాంటి వీరు కొన్ని విచిత్ర పరిస్థితుల్లో ప్రేమలో పడటం. ఆ తర్వాత వారి ప్రేమకథ ఎన్నో మలుపులు తిరిగి చివరికి పెళ్లితో సుఖాంతమవటం జరుగుతుంది.

ఇప్పటి కథేంటంటే....

Venkatesh praises Madhavan in twitter

తను, మనుల వైవాహిక జీవితంలో చోటుచేసుకునే సంఘటనల నేపథ్యంలో రెండో భాగాన్ని తెరకెక్కించారు. అచ్చం తనును పోలిన అమ్మాయి అనుకోకుండా వీరి జీవితాల్లో అడుగుపెడుతుంది. తను మనస్తత్వానికి భిన్నంగా ఉండే ఆ అమ్మాయి పట్ల మను ఆకర్షితుడవుతాడు. అప్పుడు తను, మనుల వైవాహిక జీవితంలో చోటుచేసుకునే పరిణామాలేమిటన్నది తెలుసుకోవాలంటే 'తను వెడ్స్‌ మను రిటర్న్స్‌' చూడాల్సిందే.

ఇక రీసెంట్ గా 'క్వీన్‌' చిత్రంతో జాతీయ పురస్కారం అందుకున్న కంగనా తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ఇదే కావడం విశేషం. మొదటి భాగంలోని తను పాత్రకు తోడు కుసుం దత్తో సాంగ్వన్‌ అనే హరియాణీ అథ్లెట్‌గానూ నటించింది.

కంగనా మాట్లాడుతూ... ''ఇందులో నేను పోషించిన రెండు పాత్రలు పూర్తి భిన్నంగా ఉంటాయి. కాస్త స్వార్థం, కాస్త అల్లరి కలగలపిన అమ్మాయిగా తను పాత్రలో, అందరూ ఇష్టపడే పరిపూర్ణమైన మహిళ దత్తోగా నటించాను. తను గ్లామరస్‌గా ఉంటే, దత్తో ఎత్తు పళ్లతో కనిపిస్తుంది. ఈ రెండు పాత్రలూ కనిపించే సన్నివేశాలను సవాల్‌గా తీసుకుని నటించా. తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా నాకు చక్కటి అనుభవం. ఈ చిత్ర విజయంపై నమ్మకంగా ఉన్నాను'' అన్నారామె.

అలాగే...'తను వెడ్స్‌ మను రిటర్న్స్‌'లో తనది ఓ ప్రత్యేకమైన పాత్ర అని బాలీవుడ్‌ నటుడు జిమ్మీ షెర్గిల్‌ అన్నారు. 2011లో వచ్చిన తను వెడ్స్‌ మనుకు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంలో తనకు ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శకుడు ఆనంద్‌ లాల్‌ రాయ్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాయ్‌ తనకు ఆప్త మిత్రుడని, ఆయనతో కలిసి ఈ సినిమాకు పనిచేయడం ఆనందంగా ఉందన్నారు.

English summary
Venkatesh lavished praises on Madhavan after watching his performance in ‘Tanu Weds Manu 2’. Tanu Weds Manu 2 stars Madhavan, Kangana Ranaut under the direction of Anand L Rai and is the sequel for hit film ‘Tanu Weds Manu’.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu