»   » డబ్బుల దండతో వెంకీ (‘రాధా’ ఫస్ట్ లుక్)

డబ్బుల దండతో వెంకీ (‘రాధా’ ఫస్ట్ లుక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వెంకటేష్ 'రాధా' ఫస్ట్ లుక్ విడుదలైంది. లక్ష్మి, తులసి లాంటి బ్లాక్ బస్ట్ హిట్ చిత్రాల తరువాత హ్యాట్రిక్ కాంబినేషన్ తో విక్టరీ వెంకటేష్, నయనతారలు జంటగా దర్శుకడు మారుతి దర్శకత్వంలో నిర్మాత డివివి దానయ్య యూనివర్సల్ మీడియా పతాకంపై తెరకెక్కిస్తున్న చిత్రం 'రాధా'. డి. పార్వతి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు ఈ రోజు(ఫిబ్రవరి 6) నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్మాత దానయ్య మాట్లాడుతూ 2013లో మా బేనర్లో నాయక్ లాంటి హిట్ చిత్రాన్ని అందించారు. ఇపుడు వెంకటేష్ తో 'రాధా' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. మారుతి చెప్పిన కథ, కథనం బాగా నచ్చడంతో నయనతార 30 నిమిషాల్లో డేట్స్ ఇచ్చారు అన్నారు.

ఇందులో వెంకటేష్ హోం మినిస్టర్‌గా, నయనతార మధ్య తరగతి అమ్మాయిగా నటిస్తుంది. వీరి మధ్య సాగే ప్రేమకథతోనే ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము. ఈ చిత్రం ప్రస్తుత ట్రెండుకు తగిన విధంగా ఉంటుంది. వెంకటేష్ ఫస్ట్ లేక్ ఫోటోలు స్లైడ్ షోలో....

 వెంకీ, నయనతార

వెంకీ, నయనతార

వరుస హిట్ చిత్రాల దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సనిమా కావడం, వెంకీ-నయనతార లాంటి హిట్ కాంబినేషన్ కావడంతో ఈచిత్రంపై మంచి అంచనాలున్నాయి.

సాంకేతిక విభాగం

సాంకేతిక విభాగం

ఈచిత్రానికి సమర్పకులు : డి. పార్వతి, సంగీతం: జె.బి, సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్, ఎడిటింగ్: ఉద్ధవ్, నిర్మాత : డివివి దానయ్య, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: మారుతి.

వెంకీ బిజీ బిజీ

వెంకీ బిజీ బిజీ

ప్రస్తుతం వెంకటేష్ వరుస చిత్రాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. మలయాళ సపర్ హిట్ ఫిల్మ్ ‘దృశ్యం', హిందీలో ఘన విజయం సాధించిన ‘ఓ మై గాడ్' చిత్రాల రీమేక్‌లతో పాటు యువ దర్శక సంచలనం మారుతి దర్శకత్వంలో ‘రాధ' సినిమాలో నటిస్తున్న వెంకటేష్...ఈ మూడు చిత్రాలను 2014లోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

హాట్ టాపిక్

హాట్ టాపిక్

ఓ అగ్ర కథానాయకుడి సినిమాలు సంవత్సరానికి రెండు విడుదలవ్వడమే గగనమైపోతున్న ఈ తరుణంలో...వెంకటేష్ తాను నటిస్తున్న మూడు చిత్రాలను ఇదే సంవత్సరం విడుదల చేయనుండటం ప్రత్యేకతను సంతరించుకుంటోంది.

 క్లాసు, మాసు

క్లాసు, మాసు

చంటి, కలిసుందాం రా, పవిత్రబంధం వంటి చిత్రాలతో కుటుంబ కథానాయకుడిగా...లక్ష్మి, తులసి చిత్రాలతో మాస్ హీరోగా సమానమైన క్రేజ్ సంపాదించుకున్న నటుడు వెంకటేష్.

మళ్లీ మల్టీ స్టారర్ చిత్రాల ట్రెండ్

మళ్లీ మల్టీ స్టారర్ చిత్రాల ట్రెండ్

దశాబ్దాలుగా తెలుగు తెరకు దూరమైన మల్టీస్టారర్ చిత్రాల ఒరవడిని ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో పున: ప్రారంభించారు. విజయగర్వం ఇసుమంతైనా చూపించరు, అపజయాన్ని ఆనందంగా అంగీకరిస్తారు. అదే వెంకటేష్ ప్రత్యేకత.

 ఉనికి కాపాడుకునే ప్రయత్నం

ఉనికి కాపాడుకునే ప్రయత్నం

సోలో హీరోగా తన సినిమాలకు ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో...మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తూ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు వెంకటేష్.

English summary
Look out Daggubati Venkatesh's upcoming flick 'Radha' first look poster, which is being directed by Maruthi. Venkatesh will be seen as a Home Minister. Nayanthara is pairing up with Venkatesh once again in this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu