For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అక్రమ నిర్మాణంపై వెంకటేష్ వివరణ

  By Srikanya
  |

  హైదరాబాద్‌: టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్‌కు హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ అధికారులు తాఖీదులు జారీ చేసిన సంగతి తెలిసిందే.ఫిలింనగర్‌లో అనుమతి లేకుండా షెడ్డు నిర్మిస్తున్నారని నోటీసులో పేర్కొన్నారు. ఈ విషయమై వెంకటేష్ తరుపున సురేష్‌ ప్రకటనల మేనేజర్‌ సమాధానమిచ్చారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

  ఆ ప్రకటనలో ...హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ ఫిలింనగర్‌-1లోని నటుడు డి.వెంకటేష్‌బాబు స్థలాన్ని 2014 సెప్టెంబరులోనే మున్నా యునైటెడ్‌ హాస్పిటాలిటీ సర్వీసెస్‌కు అద్దెకు ఇచ్చినట్లు సురేష్‌ ప్రకటనల మేనేజర్‌ పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు మంగళవారం తాఖీదులు జారీ చేశారని తెలిపారు. అక్కడ ఉన్నటువంటి అద్దెదారులకు తాఖీదులు జారీ చేసి 10 రోజుల వ్యవధిలో నిర్మాణాల మార్పుల అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలని అందులో పేర్కొన్నట్లు తెలిపారు.

  Venkatesh Responds Over GHMC Notices

  ఇక నోటీసు వివరాల్లోకి వెళితే...

  వెంకటేశ్‌కు జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఫిలింనగర్‌లో అనుమతి లేకుండా షెడ్డు నిర్మిస్తున్నారని నోటీసులో పేర్కొన్నారు. అక్రమంగా నిర్మిస్తున్న షెడ్డును తొలగించాల్సిందిగా అందులో పేర్కొన్నారు. 10 రోజుల్లోగా తగిన సమాధానం ఇవ్వాల్సిందిగా సర్కిల్‌-10 నగర ప్రణాళిక విభాగం అధికారులు తాఖీదుల్లో పేర్కొన్నారు. ఫిలింనగర్‌ రోడ్‌ నెంబరు 1లో వెంకటేష్‌కు చెందిన పాత భవనం ఉంది. దాని ముందు కొంత ఖాళీ స్థలం ఉంది. అందులో అనుమతి లేకుండా నిర్మాణ పనులు చేపడుతున్నారు.

  ఈ విషయం జీహెచ్‌ఎంసీ సర్కిల్‌-10 నగర ప్రణాళిక విభాగం అధికారుల దృష్టికి రావడంతో ఆయనకు తాఖీదులు జారీ చేశారు. ఒకవేళ నిర్ణీత సమయంలోగా సమాధానం ఇవ్వకుంటే తగిన చర్యలు తీసుకుంటామని, అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తామని అందులో స్పష్టం చేశారు.

  వెంకటేష్ తాజా చిత్రాల విషయానికి వస్తే...

  రీసెంట్ గా దృశ్యం రీమేక్ చేసి హిట్ కొట్టి,గోపాల గోపాల గా హిందీ ఓ మైగాడ్ ని రీమేక్ చేస్తున్న ఆయన మరో సినిమా రీమేక్ కమిటయ్యాడు. అదో తమిళ చిత్రం కావటం విశేషం.

  విజయ్‌ ఆంటోని, అక్ష ప్రధాన పాత్రల్లో ఎన్‌.వి.నిర్మల్‌ కుమార్‌ దర్శకత్వంలో తమిళంలో ఇటీవల విడుదలై విజయం సాధించిన చిత్రం 'సలీమ్‌'. ఈ సినిమా తెలుగు రీమేక్‌లో నటించడానికి వెంకటేష్‌ ముందుకొస్తున్నట్లు సమాచారం. యాక్షన్‌ థ్రిల్లర్‌ తరహాలో ఈ చిత్రం రూపొందింది.

  ఇక ప్రస్తుతం వెంకటేష్‌ 'గోపాల గోపాల' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.వెంకటేష్‌, పవన్‌కల్యాణ్‌ జోడీ చాలా బాగుందనీ... వారిద్దరూ ప్రేక్షకులకు సరికొత్త వినోదాలు పంచబోతున్నారని చిత్రబృందం చెబుతోంది. డాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుందని నిర్మాతలు తెలియచేసారు.

  కిషోర్ పార్ధసాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సురేష్ బాబు, శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మధు శాలిని, దీక్ష పంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హిందీలో విజయవంతమైన 'ఓ మై గాడ్‌' చిత్రానికిది రీమేక్‌. పవన్‌ కల్యాణ్‌ మోడరన్‌ కృష్ణుడు పాత్రలో కనిపిస్తాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో చిత్ర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

  దర్శకుడు మాట్లాడుతూ... ''భూకంపం కారణంగా తనకు జరిగిన అన్యాయానికి ప్రకృతే కారణమని నష్టపరిహారం ఇవ్వడానికి బీమా సంస్థ నిరాకరిస్తుంది. ఆ సమయంలో ఆ వ్యక్తి ఏం చేశాడనే అంశం ఆధారంగా చిత్రం రూపొందుతోంది. పవన్‌ కల్యాణ్‌, వెంకటేష్‌ కలయికలో చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. స్వామీజీగా మిథున్‌ చక్రవర్తి నటన చిత్రానికి ప్రధానాకర్షణగా నిలుస్తుంది'' అంటున్నారు.

  సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. చిత్రంలో కృష్ణుడు, మధుశాలిని, వెన్నెల కిషోర్‌, దీక్షా పంత్‌ తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఛాయాగ్రహణం: జయనన్‌ విన్సెంట్‌, కూర్పు: గౌతంరాజు

  English summary
  venkatesh gave Clarifications Over GHMC Notices. Venkatesh was served a notice by the Greater Hyderabad Municipal Corporation (GHMC) for taking up construction work for a shed without permission at his residence at Filmnagar main road of Jubilee Hills in the city.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X