»   » అయ్యో..అయ్యో..అయ్యయ్యో... :వెంకటేష్ ‘బాబు బంగారం’ టీజర్ (వీడియో)

అయ్యో..అయ్యో..అయ్యయ్యో... :వెంకటేష్ ‘బాబు బంగారం’ టీజర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మీకు గుర్తుందా వెంకటేష్ సూపర్ హిట్ బొబ్బిలిరాజా చిత్రంలోని అయ్యో...అయ్యో..అయ్యయ్యో మేనరిజం. ఇప్పుడది మళ్లీ వెంకటేష్ నోటి వెంట వినబోతున్నారు. అవును మీరు చదివింది నిజమే. రుజువు కావాలంటే క్రింద టీజర్ చూడండి..

వెంకటేష్, నయనతార జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'బాబు బంగారం'. కంటిన్యూ షెడ్యూల్స్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో వెంకటేష్ పోలీసు అధికారిగా వినోదాత్మకమైన పాత్రలో కనిపిస్తున్నారు.


వెంకటేష్ స్టైల్లో సరదాగా సాగే ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ఇప్పటికే ఫస్ట్‌లుక్‌ విడుదలై అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించింది. ఇక సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానుల్లో ఉత్సాహం నింపేందుకు టీమ్, ఈ రోజు మందుగా ప్రకటించినట్లుగానే ఫస్ట్ టీజర్‌ను విడుదల చేసింది. ఆ టీజర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.ఇప్పటికే షూటింగ్ పూర్తికావచ్చిన ఈ సినిమా పాటల చిత్రీకరణ కోసం స్పెయిన్ వెళుతున్నారు. అలాగే, మిగతా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు త్వరలో పూర్తిచేసి జూలై మొదటివారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వెంకటేష్ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. భలే భలే మగాడివోయ్ సక్సెస్ తరువాత మారుతి రూపొందిస్తున్న చిత్రమిదే.


Venkatesh's 'Babu Bangaram' Movie Teaser

నిర్మాతలు మాట్లాడుతూ, 'ఫ్యామిలీ చిత్రాల కథానాయికుడిగా వెంకటేష్‌ మంచి పేరు తెచ్చుకున్న విషయం విదితమే. ఆయన మరోసారి తన మార్క్‌ వినోదాన్ని పంచడానికి రెడీ అవుతున్నారు. వెంకటేష్‌ నుంచి ప్రేక్షకులు కోరుకునే కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. యూత్‌, మాస్‌ ఆడియెన్స్‌కి నచ్చే అంశాలను సైతం మేళవించి ఆద్యంతం వినోదాత్మకంగా రూపొందిస్తున్నాం.


దర్శకుడు మారుతి వెంకటేష్‌ పాత్రను చాలా వైవిధ్యంగా తీర్చిదిద్దుతున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్‌ చేస్తున్నాం. ఆద్యంతం వైవిధ్యంగా రూపొందుతున్న ఈ చిత్రం మా బ్యానర్‌కి మంచి విజయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాం' అని అన్నారు.


ఈ సినిమాలో వెంకటేష్ ఓ కామిక్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు గిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ టీజర్‌తో పాటే ఆడియో, విడుదల తేదీలను ప్రకటించించారు గమనించండి.


English summary
Watch Babu Bangaram teaser. Ft Venkatesh and Nayanthara in the lead roles. Film written and directed by Maruthi. Music composed by Ghibran, Cinematography Richard Prasad, Produced by S. Naga Vamshi under Sithara Entertainments banner.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu