»   » అన్నయ్య సురేష్ బాబుతో హీరో వెంకటేష్ గొడవ

అన్నయ్య సురేష్ బాబుతో హీరో వెంకటేష్ గొడవ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు వారసులుగా సినీ రంగ ప్రవేశం చేసిన సురేష్ బాబు, వెంకటేష్ లు తండ్రికి తగ్గ వారసులుగా పేరు తెచ్చుకున్నారు. సురేష్ బాబు నిర్మాతగా రాణిస్తుంటే, వెంటేష్ అగ్రహీరోగా తన సత్తా చాటుతున్నాడు. ఇప్పటి వరకు అన్నదమ్ముల మధ్య ఎలాంటి గొడవలు లేవు. అయితే తాజాగా వీరిద్దరి మధ్య చిన్న పాటి గొడవ చోటుచేసుకుందని, తమ్మడు వెంకటేష్ అన్న సురేష్ బాబుపై కోపంగా ఉన్నాడని తెలుస్తూంది.

ఈ గొడవకు కారణంగా సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన బాడీగార్డ్ చిత్రమే. రెండు రోజుల క్రితం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మన రాష్ట్రంలో 120 ప్రింట్లతో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. గతంలో ఏ హిందీ సినిమా కూడా ఇంత భారీగా విడుదల కాలేదు. వెంకటేష్ కూడా ఇదే స్టోరీతో 'గంగా ది బాడీగార్డ్" పేరుతో తెలుగు వెర్షన్ లో నటిస్తున్నారు. మరికొన్ని వారాల్లో ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే తన సినిమా కంటే ముందే సల్మాన్ సినిమా రావడం వెంకీని ఆందోళన కు గురి చేస్తోంది. అందులోనూ మన రాష్ట్రంలో ఇంత భారీ ఎత్తున విడుదలవడం వెంకీ సినిమాకు ఎంతో కొంత నష్టం కలిగించే అంశమే.

ఈ సినిమాకు, వెంకీ తన అన్నయ్యతో గొడవ పడటానికి కారణం ఏమిటనేదే కదా మీ ప్రశ్న? కారణం ఉంది. టాలీవుడ్ బడా నిర్మాతల్లో సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు ఒకరు. రాష్ట్రంలోని చాలా థియేటర్లు ఆయన గుప్పిట్ల్లో ఉంటాయి. ఆయన తలుచుకుని ఉండి ఉంటే సల్మాన్ సినిమాను అన్ని థియేటర్లలో విడుదల కాకుండా అడ్డుకుని ఉండే వారు. కానీ అలా చేయలేదు. దీనిపై వెంకటేష్ అన్నయ్యతో గొడవపడినట్లు సమాచారం. తన కొడుకు రాణా బాలీవుడ్ భవిష్యత్ కోసమే సల్మాన్ సినిమాలో వేలు పెట్టలేదని వెంకీ అనుమానమట. అదీ సంగతి.

English summary
Venky is miffed with his elder brother Suresh Babu. The reason for that is Bollywood superstar Salman Khan and his new film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu