»   » శాటిలైట్ రైట్స్ వెంకీకే, ‘దృశ్యం’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ సూపర్

శాటిలైట్ రైట్స్ వెంకీకే, ‘దృశ్యం’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ సూపర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వెంకటేష్, మీనా ప్రధాన తారాగణంగా శ్రీప్రియ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన 'దృశ్యం' చిత్రం మంచి వసూళ్లు సాధిస్తూ ముందుకు సాగుతోంది. బాక్సాఫీసు వద్ద ఇప్పటికే వారం రోజులు పూర్తి చేసుకున్న ఈచిత్రం స్మాల్ బడ్జెట్ మూవీ ఊహించిన దానికంటే బాక్సాపీసు వద్ద మంచి కలెక్షన్స్ సాధిస్తోంది.

జులై 11న పరిమిత సంఖ్యలో మాత్రమే థియేటర్లలో విడుదలైన 'దృశ్యం' చిత్రం ఫ్యామిలీ ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తోంది. రివ్యూలు కూడా పాజటివ్ గా రావడంతో ప్రేక్షకాదరణ పెరిగింది. తొలి ఏడు రోజుల్లో ఈ చిత్రం వరల్డ్ వైడ్ దాదాపుగా రూ. 9.5 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

ఎ క్లాస్ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఎమోషనల్ అండ్ ఫామిలీ ఎలిమెంట్స్ ఉండటంతో మల్టీప్లెక్సుల్లో సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అయితే మాస్ ప్రేక్షకులు ఎక్కువగా వెళ్లే బి, సి సెంటర్లలో మాత్రం ఆదరణ అంతంత మాత్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సురేష్ బాబు మీడియం బడ్జెట్ తెరకెక్కించినా....ప్రమోషన్ల కోసం భారీగా ఖర్చు పెట్టారు. రూ. 6 కోట్ల బడ్జెట్ అయితే...మరో 3 కోట్లు ప్రమెషన్స్ కోసం ఖర్చు పెట్టారట.

Venkatesh's Drushyam (7 Days) First Week Collection At Box Office

శాటిలైట్ రైట్స్ ఎంత వస్తే అంత వెంకటేష్ రెమ్యూనరేషన్‌గా ఇవ్వాలని డీల్ కుదిరింది. ఈ మేరకు ఈ చిత్రానికి రూ. 5.50 కోట్లు శాటిలైట్ రైట్స్ రూపంలో రాగా ఆ మొత్తం వెంకీకి రెమ్యూనరేషన్‌గా సెటిల్మెంట్ చేసినట్లు తెలుస్తోంది. మళయాలంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన 'దృశ్యం' చిత్రం హిట్ అవ్వడంతో...అదే పేరుతో తెలుగులో వెంకటేష్‌తో రీమేక్ చేసారు.

చిత్రం కథ విషయానికి వస్తే...తన ఊళ్లో కేబుల్ నడుపుకుంటున్న రాంబాబు(వెంకటేష్) కి తను చూసే సినిమాలు, తన భార్య(మీనా) పిల్లలే లోకం. తన జీవితంలో వచ్చే సమస్యలకు తను చూసిన సినిమాల్లోంచే పరిష్కారాలు వెతుక్కునే అతను ఊహించని సమస్యని ఎదుర్కోవాల్సి వస్తుంది.

అతని కుమార్తె అంజు బట్టలు మార్చుకునేటప్పడు...సెల్ లో వీడియో తీసి వరుణ్ అనే కుర్రాడు బ్లాక్ మెయిల్ చేస్తూంటాడు. దాన్ని నుంచి తప్పించుకునే ప్రాసెస్‌లో వరుణ్..అంజు చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. వరుణ్ ... ..పోలీస్ ఐజీ గీతా ప్రభాకర్ (నదియా) కొడుకు. ఈ విషయం తెలుసుకున్న రాంబాబు ఏం చేసాడు. ఏ విధంగా ప్లాన్‌లు వేసి, తన కుటుంబాన్ని వేటాడటానికి సిద్దమైన పోలీస్ డిపార్టమెంట్ నుంచి కాపాడుకున్నాడు అనేది ఉత్కంట కలిగించే కథనం.

English summary
The producer of hit movie Manam created a new trend by releasing the movie in a limited number of cinema halls in the first week and based on the viewers response, they increased the number of screens in the second week. This business strategy yielded them good results. The makers of Drushyam adopted the same strategy, which has worked out wonders for the film at the Box Office in the first week.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu