twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్యామిలీ థ్రిల్లర్ ('దృశ్యం‌' ప్రివ్యూ)

    By Srikanya
    |

    హైదరాబాద్ : తెలుగులో థ్రిల్లర్ జనర్ లో వచ్చే చిత్రాలు తక్కువ,వచ్చినా అవి ఊరు పేరూ లేని చిన్న బ్యానర్, చిన్న హీరోలతో తెరకెక్కి వచ్చి వెళ్లినట్లు కూడా ఎవరికీ తెలియకుండా థియోటర్స్ నుంచి మాయమైపోతూంటాయి. కానీ ఇప్పుడు ఓ థ్రిల్లర్ కథాంశంతో, భావోద్వేగ సంఘటనలతో కూడిన కథతో వెంకటేష్ 'దృశ్యం‌'చిత్రంతో మన ముందుకు వస్తున్నారు. చాలా కాలం నుంచీ హిట్ కు దూరమైన ఆయన ఈ చిత్రంపై చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. మళయాళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ అదే స్ధాయి విజయం సంపాదిస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం స్పెషల్ షోలతో సినీ వర్గాలలో, మీడియాలో మంచి టాక్ నే సంపాదించుకుంది.

    ఈ చిత్రంలో రాంబాబు కు వెంకటేష్ కనిపిస్తారు. ఓ చిన్న ఊరులో కేబుల్ నెట్ వర్క్ నడుపుకుంటూ కుటుంబాన్ని గడుపుతున్న రాంబాబు కి భార్య (మీనా) ఇద్దరు పిల్లలు. ఓ రోజు ఐజీ గీత ప్రభాకర్(నదియా)కుమారుడు కనిపించకుండా మాయమైపోతాడు. దానికీ రాంబాబు కుటుంబంలో జరిగిన ఓ సంఘటనకీ ఆ మాయం కు సంభంధం ఉంటుంది. ఇంతకీ ఏం జరిగింది. ఐజీ కొడుకు విషయంలో ఆ కుటుంబం ఎందుకు కలగచేసుకోవాల్సి వచ్చింది. ఐజీ ఊరుకున్నారా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    Venkatesh's Drushyam Preview

    కనిపించేదంతా నిజం కాదు అనే ట్యాగ్ లైన్ తో రెడీ అయిన ఈ చిత్రం ప్రస్తుతం సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు.. వాటి వల్ల ఆయా కుటుంబ సభ్యులు పడుతున్న ఇబ్బందుల్ని కళ్లకు కట్టేలా తీర్చిదిద్దామని చెప్తున్నారు. మహిళా దర్శకురాలు ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనుండటంతో ఈ అంశంపై మరింత శ్రద్ద పెట్టినట్లు తెలుస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా జీతు జోసెఫ్ దర్శకత్వంలో రూపొంది ఘన విజయం సాధించిన "దృశ్యం'' సినిమాను తెలుగులో వెంకటేష్ హీరోగా పునర్ నిర్మించారు.

    నిర్మాత మాట్లాడుతూ...''గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు.. వాటి వల్ల ఆయా కుటుంబ సభ్యులు పడుతున్న ఇబ్బందుల్ని కళ్లకు కట్టేలా దర్శకురాలు తీర్చిదిద్దుతున్నారు. అనేక సమకాలీన అంశాల్ని చిత్రంలో పొందుపరుస్తున్నారు. తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధాన్ని చూపే సన్నివేశాల్ని దర్శకురాలు చక్కగా తెరకెక్కించారు'' అంటున్నారు.

    చిత్రం: దృశ్యం
    బ్యానర్: రాజ్‌కుమార్‌ థియేటర్స్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌, వైడ్‌ యాంగిల్‌ క్రియేషన్స్‌
    నటీనటులు: వెంకటేష్, మీనా, నదియా, పరుచూరి వెంకటేశ్వరరావు, చలపతిరావు, సమీర్, రవి కాలె, సప్తగిరి నాయుడు, గోపి, రోషన్ బషీర్, ఉత్తేజ్, కాదంబరి కిరణ్, కాశీ విశ్వనాధ్, జోగినాయుడు, చిత్రం శ్రీను, చైతన్యకృష్ణ, బెనర్జీ, ప్రభు, ప్రసన్నకుమార్, అన్నపూర్ణమ్మ, సంధ్యాజనక్ తదితరులు.
    కెమెరా: ఎస్.గోపాల్‌రెడ్డి,
    సంగీతం: శరత్,
    కథ: జీతూ జోసెఫ్,
    ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్,
    రచన: పరుచూరి బ్రదర్స్, మాటలు: స్వామి,
    నిర్మాత: డి.సురేష్‌బాబు, రాజ్‌కుమార్ సేతుపతి,
    సమర్పణ: డి రామానాయుడు
    దర్శకత్వం:శ్రీ ప్రియ

    English summary
    Releasing on July 10, Friday, Tollywood film Drushyam is an eponymous remake of Malayalam blockbuster Drishyam featuring Mohanlal and Meena in the leads. Drushyam directed by Sripriya has Venkatesh and Meena playing the lead roles. Nadhiya is donning the role done by Asha Sarath in the original. Music for the movie is composed by Sharreth whereas S. Gopal Reddy has handled cinematography and Marthand K. Venkatesh editing.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X