»   » గోల్‌మాల్ : అవే బట్టలు వెంకీకి, ఫస్ట్‌లుక్ ఇదే(ఫోటో)

గోల్‌మాల్ : అవే బట్టలు వెంకీకి, ఫస్ట్‌లుక్ ఇదే(ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్ నటించిన బాలీవుడ్ హిట్ మూవీ 'బోల్ బచ్చన్' చిత్రానికి రీమేక్‌గా....వెంకటేష్, రామ్‌లతో 'గోల్ మాల్' చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలో వెంకటేష్ లుక్ బయటకు లీకైంది. హిందీ సినిమాలో అజయ్ దేవగన్ వేసిన డ్రెస్ డిజైన్సే ఈ సినిమాలోనూ వెంకటేష్ కోసం వాడుతున్నారు. దీన్ని బట్టి సినిమా హిందీలో ఎలాగుందో తెలుగులోనూ మక్కికి మక్కి దించుతున్నట్లు స్పష్టమవుతోంది.

ఈ చిత్రానికి విజయ్‌భాస్కర్‌.కె దర్శకత్వం వహిస్తున్నారు. వెంకీ సరసన అంజలి, రామ్ సరసన షాజన్‌ పదమ్‌సీ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్రవంతి మూవీస్ బేనర్‌పై స్రవంతి రవి కిషోర్‌ నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి సురేష్‌బాబు సమర్పకులు.

ప్రస్తుతం తెలుగులో ఎంటర్టెన్మెంట్ సబ్జెక్టులకే మంచి ఆదరణ ఉన్న నేపత్యంలో ఈచిత్రం తెలుగు బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు ఇస్తుందని ఆశిస్తున్నారు. బోల్ బచ్చన్ లో అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, అసిన్, ప్రచీ దేశాయ్, అస్రానీ, అర్చనా పూరణ్‌సింగ్ తదితరులు నటించారు. సంగీతం హిమేష్ రేషిమియా అందించారు. దర్శకుడు రోహిత్‌శెట్టి డైరక్ట్ చేసాయగా, అజయ్ దేవగన్ నిర్మించారు. అయితే ఈ చిత్రం హృషికేశ్ ముఖర్జీ హిట్ 'గోల్ మాల్' (1979) కి రీమేక్ కావటం విశేషం. కామెడీ ఆఫ్ ఎర్రర్స్,పంచ్ డైలాగ్స్ తో ఈ చిత్రం నవ్విస్తూ సాగుతుంది. బాలీవుడ్ లో ఈ చిత్రం మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. అందుకే తెలుగు వెర్షన్ కు గానూ గోల్‌మాల్ అనే టైటిల్ ని పెట్టారు.

English summary

 Venkatesh's Golmaal first look out. Golmaal is the official remake of Hindi super hit Bol Bachchan which is high on entertainment quotient. Director K Vijay Bhaskar is wielding the megaphone for the film and he is making ample changes to the script to suit the tastes of Telugu audiences.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu