»   » జామురాతిరి జాబిలమ్మ..నేను, శ్రీదేవి ఒకరినొకరు చూసుకుంటూ చేశాం, వెంకీ మధుర జ్ఞాపకాలు!

జామురాతిరి జాబిలమ్మ..నేను, శ్రీదేవి ఒకరినొకరు చూసుకుంటూ చేశాం, వెంకీ మధుర జ్ఞాపకాలు!

Subscribe to Filmibeat Telugu
అదే శ్రీదేవి ప్రత్యేకత, ఆమె ఎక్స్ప్రెషన్స్ ని గమనించే వాడిని

అతిలోక సుందరి శ్రీదేవి కోట్లాదిమంది తన అభిమానులని విడచి వెళ్లిపోయారు. ఆమె నటించిన చిత్రాలు జ్ఞాపకాలు మాత్రం సినిమా లోకం ఉన్నన్ని రోజులు ఉంటాయి. చిన్ననాటి నుంచే నటిగా ప్రయాణం మొదలు పెట్టిన శ్రీదేవి అంటే టాలీవుడ్ స్టార్స్ చాలా అభిమానం శ్రీదేవి ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు వంటి సీనియర్ నటులతో నటించి మెప్పించారు.అలాగే రెండవతరం నటులైన చిరంజీవి, వెంకటేష్ మరియు నాగార్జునతో కూడా నటించి మెప్పించారు. శ్రీదేవి అంత్యక్రియలకు హాజరై తిరిగి వచ్చిన తరువాత విక్టరీ వెంకటేష్ శ్రీదేవితో ఉన్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

సీనియర్లతో బెదురులేకుండా

సీనియర్లతో బెదురులేకుండా

ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ మరియు శోభన్ బాబు వంటి హీరోలతో శ్రీదేవి బెదురూ లేకుండా నటించి మెప్పించింది. సీనియర్ హీరోల పక్కన కూడా అందంగా ఒదిగిపోయి నటించింది.

రెండవ తరం హీరోలు

రెండవ తరం హీరోలు

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ మరియు నాగార్జున వంటి రెండవ తరం నటులతో కూడా శ్రీదేవి ఆడి పాడింది. తెలుగు వెండి తెరపై శ్రీదేవి సోయగం, నటన తెలుగువారు ఎప్పటికి మరచిపోరు.

 విక్టరీ వెంకటేష్ సరసన

విక్టరీ వెంకటేష్ సరసన

అప్పటికే మెగాస్టార్ చిరంజీవి చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో శ్రీదేవి నటించి మెప్పించింది. ఆ చిత్రంలో దేవ కన్యగా శ్రీదేవి రూపం, నటన వర్ణనాతీతం. ఆ తరువాత శ్రీదేవి విక్టరీ వెంకటేష్ క్షణ క్షణం చిత్రంలో నటించి మెప్పించింది.

అంత్యక్రియల నుంచి తిరిగి వచ్చాక

అంత్యక్రియల నుంచి తిరిగి వచ్చాక

క్షణ క్షణం చిత్రంలో తనతో నటించిన శ్రీదేతో వెంకీకి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. దీనితో శ్రీదేవి మరణ వార్త తెలుసుకుని వెంకీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ముంబై వెళ్లి ఆమె అంత్య క్రియల్లో పాల్గొన్నారు. తిరిగి వచ్చాక ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి జ్ఞాపకాలని నెమరు వేసుకున్నారు.

చెన్నైలో ఉన్నప్పుడే

చెన్నైలో ఉన్నప్పుడే

తమ కుటుంబం చెన్నైలో ఉన్నప్పుడే శ్రీదేవి గురించి విన్నానని వెంకీ అన్నారు. చైల్డ్ ఆర్టిస్టుగా శ్రీదేవి సినిమాల్లోకి వచ్చినప్పుడే ఆమె గురించి తెలుసుకున్నా అని వెంకీ అన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీదేవి చాలా బాగా చేస్తోంది అని అంతా అనేవాళ్ళు.

 ఆమె జర్నీ మోస్ట్ రేర్

ఆమె జర్నీ మోస్ట్ రేర్

శ్రీదేవి సినిమా జర్నీ మోస్ట్ రేర్ అని వెంకీ అన్నారు. శ్రీదేవి లాంటి వాళ్ళని చూస్తే వారు సినిమా కోసమే పుట్టారని అనిపిస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా విజయం సాధించారు. అన్ని చిత్ర పరిశ్రమల్లో హీరోయిన్ గా టాప్ పొజిషన్ కు చేరుకున్నారు.

 అదే శ్రీదేవి స్పెషాలిటీ

అదే శ్రీదేవి స్పెషాలిటీ

శ్రీదేవి ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి నటులతో నటించారు. ఆ తరువాత మా తరం నటులతో కూడా నటించారు అని వెంకీ తెలిపాడు. వెళ్లిన ప్రతి ఇండస్ట్రీలో సక్సెస్ సాధించారు. అదే శ్రీదేవి ప్రత్యేకత అని వెంకీ అన్నారు.

 నా కంటే చాలా సీనియర్

నా కంటే చాలా సీనియర్

క్షణ క్షణం చిత్రంలో శ్రీదేవి హీరోయిన్ అనగానే మేమంతా చాలా ఎగ్జైట్ అయ్యాం అని వెంకీ అన్నారు. నటనలో శ్రీదేవి అప్పటికే నా కన్నా చాలా సీనియర్.

 క్లైమాక్స్ గమ్మత్తుగా ఉంటుంది

క్లైమాక్స్ గమ్మత్తుగా ఉంటుంది

క్షణ క్షణం చిత్ర క్లైమాక్స్ గమ్మత్తుగా ఉంటుంది. ట్రైన్ సన్నివేశాల్లో నేను పడిపోతే ఆమె చేయి ఇవ్వడం చాలా ఫన్నీగా ఉంటుంది. మేమిద్దరం చాలా బాగా నటించాం. కొన్ని అద్భుతమైన భావాల్ని మా నుంచి రాంగోపాల్ వర్మ రాబట్టారు.

 జామురాతిరి జాబిలమ్మ

జామురాతిరి జాబిలమ్మ

జామురాతిరి జాబిలమ్మ సాంగ్ ఓ క్లాసిక్. సాంగ్ మొత్తం నేను, శ్రీదేవి కూర్చునే హావ భావాల్ని పలికించాం అని వెంకీ అన్నారు. హీరో హీరోయిన్లు కూర్చుని సాంగ్ మొత్తం చేయడం మరెక్కడ జరగలేదు అని వెంకీ అన్నారు. శ్రీదేవి నా ఎక్స్ప్రెషన్స్ ని గమనించే వారు, నేను ఆమె ఎక్స్ప్రెషన్స్ ని గమనించే వాడిని. ఆ సాంగ్ మా ఇద్దరికీ మధురమైన అనుభవం అని వెంకీ అన్నారు.

 నాన్నకు ఫెవరెట్ ఆర్టిస్ట్

నాన్నకు ఫెవరెట్ ఆర్టిస్ట్

శ్రీదేవి మా నాన్న రామానాయుడు గారికి ఫెవరెట్ ఆర్టిస్ట్. ఆమె చూపించే డెడికేషన్ గురించి ఆయన ప్రశంసించే వారు. సురేష్ ప్రొడక్షన్స్ లో శ్రీదేవి ముందడుగు, తోఫా వంటి చిత్రాల్లో నటించారు.

చాలా షాకింగ్

చాలా షాకింగ్

శ్రీదేవి మరణ వార్త తెలియగానే చాలా షాక్ కి గురయ్యా అని వెంకీ తెలిపాడు. వెంటనే ముంబై వెళ్లి వారి కుటుంబానికి అండగా ఉండాలని అనిపించింది. నాకు, అన్నయ్యకు బోనికపూర్, అనిల్ కపూర్ చాలా సన్నిహితులు. .

English summary
Venkatesh remembers Sridevi. Venkatesh shares beautiful movements with Sridevi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu