»   » అమీర్ ఖాన్ కామెంట్స్: మద్దతుగా నిలిచిన హీరో వెంకటేష్

అమీర్ ఖాన్ కామెంట్స్: మద్దతుగా నిలిచిన హీరో వెంకటేష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అసహనం విషయంలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగా ఎంత పెద్ద దుమారం రేపాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నా భార్య ఈ దేశం విడిచి వెళదామని అంటోంది అంటూ అమీర్ ఖాన్ చేసిన కామెంట్స్‌ను చాలా మంది సినీస్టార్లు ఖండించగా...కొందరు మాత్రం ఆయనకు మద్దతుగా నిలిచారు. ఇలా అమీర్ ను సపోర్టు చేసిన వారిలో తెలుగు హీరో వెంకటేష్ కూడా చేరారు.

ఇటీవల ఓ ఈవెంటులో పాల్గొన్న వెంకటేష్ మీడియాతో ఈ విషయమై స్పందించారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఈ విషయంలో అతిగా, లేనిది ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మీడియా కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తోంది. అమీర్ ఖాన్ వ్యాఖ్యలను అంతా తప్పుగా అర్థం చేసుకున్నారని భావిస్తున్నాను అని వెంకటేష్ అన్నారు.

Venkatesh Stands With Aamir Khan

రెహమాన్ మద్దతు..
అమీర్ ఖాన్ వ్యాఖ్యలను ఇతర నటీనటులు, రాజకీయ నేతలు, సామాన్య జనంతో పాటు ఎంఐఎం లాంటి పార్టీలు కూడా తప్పుబట్టాయి. అయితే ఆస్కార్ విన్నింగ్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మాత్రం డిఫరెంటుగా స్పందించారు. అమీర్ ఖాన్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానట్లు తెలిపారు. దేశంలో అసంహనం పెరుగుతోందని, తనపై సున్నీ మస్లిం సంస్థ రజా అకాడమీ ఫత్వా జారీ చేసినపుడు దాదాపు తనలోనూ ఇలాంటి భయమే కలిగిందన్నారు.

అమీర్ ఖాన్ వివరణ..
కాగా తన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో అమీర్ ఖాన్ వివరణ ఇచ్చారు. నేను, నా భార్య ఈ దేశం విడిచి వెళ్లాలని కోరుకోవడం లేదన్నారు. ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాను, ఇక్కడే ఉంటాను, భారత గడ్డపై పుట్టినందుకు గర్వంగా ఉందన్నారు. దేశంలోని ప్రజల మధ్య సోదరభావం కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు అమీర్ ఖాన్ తెలిపారు. గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో మాట్లాడుతూ....వృత్తి ధర్మంలో భాగంగా చేసే పనికి తీవ్ర విమర్శలకు గురైనపుడు తాను కూడా ఇలాంటి అసహన పరిస్థితులను ఎదుర్కొన్నట్లు తెలిపారు. మతం పేరుతో చేసే హింసకు తాను పూర్తిగా వ్యతిరేకమని, నాగరిక ప్రపంచంలో ఎట్టి పరిస్థితుల్లోనూ హింస అనేది ఉండ కూడదు అన్నారు.

English summary
Venkatesh Stands With Aamir Khan Regarding His Comments On Growing Intolerance In India. He thinks Aamir Khan's statements are misunderstood and said he agrees with him.
Please Wait while comments are loading...