»   » అనుష్క ప్రియుడి చేయినరికిన తర్వాత...వెంకటేష్‌

అనుష్క ప్రియుడి చేయినరికిన తర్వాత...వెంకటేష్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెల్లటి దుస్తుల్లో రాజుపాత్ర అనుష్క ప్రియుడి చేయినరికిన తర్వాత వింతగా నవ్వడం అనేది అందరికీ నచ్చిందని వెంకటేష్‌ అన్నారు. అలాగే నెగెటివ్‌ పాత్రలు చేస్తేనే ప్రేక్షకుల బాగా రిసీవ్‌ చేసుకుంటారని అన్నారు. రజనీకాంత్‌, అమితాబ్‌బచ్చన్‌, హాలీవుడ్‌ హీరోలుసైతం కొన్ని సన్నివేశాల్లో నెగెటివ్‌ ఛాయలున్నా వారు నటించి మెప్పించారని ఆయన గుర్తుచేశారు. నాగవల్లి చిత్రంలోని రాజు పాత్ర గురించి రజనీకాంత్‌ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని పేర్కొన్నారు. 'నాగవల్లి' విజయోత్సవసభ శనివారం రామానాయుడు స్టూడియోలో జరిగింది.

ఈ సందర్భంగా వెంకటేష్‌ మాట్లాడుతూ, రాజు పాత్రకు అభినందలుచాలా పొందాననీ, తనకు బాగా నచ్చింది కూడా అదేనంటూ.. నాన్నగారు ఈ చిత్రాన్ని చూసిన వెంటనే ఆప్యాయంగా కౌగిలించుకుని చాలా ఎమోషనల్‌గా ఫీలయ్యారని వెల్లడించారు. ఇందులోని ప్రతి పాత్రను అద్భుతంగా మలిచారన్నారు. ఓల్డ్‌గెటప్‌ కష్టమే అయినా ఇష్టంగా చేశానన్నారు. రాజు గెటప్‌కు 4గంటలు పట్టిందన్నారు. ఇటువంటి కథలో డ్యూయెట్లు పెడితే కథకు అడ్డంకింగా ఉంటుందని పెట్టలేదన్నారు.

దేవుడు ఎక్కడో లేడనీ, ప్రతి మనిషిలోనూ ఉన్నాడంటూ.. ఈ సినిమా చేసినప్పుడు చాలామంది ఏమవుతుందోనని భయపెట్టారు. దాన్ని మనం మనసుకు ఎక్కించుకోకుండా పనిచేసుకుంటేపోతే ఏమీ కాదని వివరించారు. వైవిధ్యమైన పాత్రలు చేయడం చాలా అరుదుగా లభిస్తుందన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu