»   » వెంకటేష్ కి ఈ తొందరేంటి?

వెంకటేష్ కి ఈ తొందరేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

వెంకటేష్ వరసగా సినిమాలు కమిటవుతూ అందరికీ షాక్ ఇస్తున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్సకత్వంలో బాడీగార్డు రీమేక్ లో చేస్తున్నారు వెంకటేష్. త్రిష హీరోయిన్ గా చేస్తున్న ఈ చి్త్రం షూటింగ్ పూర్తి కావొచ్చింది. మరో ప్రక్క వెంకటేష్ హీరోగా దశరధ్ హీరోగా సింహా నిర్మాతలు మరో చిత్రం ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ బాడీగార్డు పూర్తయిన కొద్ది రోజులుకు మొదలవుతుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం అనంతరం మహేష్ బాబుతో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సీతమ్మ వాకిట్లోసిరిమల్లె చెట్టు చిత్రం మొదలెడతారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. వీటి తర్వాత వెంకటేష్ ని వివేకానందుడుగా చూపిస్తూ ఓ చిత్రం ప్రారంభం కానుంది. చిత్రం దర్శకుడు ఎవరనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అనంతరం వియన్ ఆదిత్య చిత్రం కూడా కమిటయ్యే అవకాసం ఉంది. వీటిన్నటితో పాటు వెంకటేష్ ఓ గేమ్ షో కూడా ప్లాన్ చేస్తున్నారు.

English summary
Venky will soon begin his next film with director Dasarath, which might hit the floors shortly. The script work is under progress and the pre-production works of the film will commence once the script gets finalized.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu