For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సెకెండ్ హ్యాండ్ వెంకటేష్(స్పెషల్)

  By Staff
  |
  Venkatesh
  తెరపై మనం చూసే వెంకటేష్ సెకెండ్ హ్యాండ్ వస్తువు అని వెంకీ స్వయంగా పుట్టిన రోజు(శనివారం)సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వూలో అన్నారు. జీవంతం గురించి ఫిలాసపి చెప్తున్న ఆయన్ని..తెర మీద కనిపించే అల్లరి వెంకటేష్‌... ఇప్పుడు మాట్లాడుతున్న వెంకటేష్‌... ఇద్దరూ వేర్వేరా..? అంటే ఇలా చెప్పుకొచ్చారు. తెర మీద మీరు చూసే వెంకటేష్‌ ఓ సెకండ్‌ హ్యాండ్‌ వస్తువు. ఇప్పుడు మీ ముందు ఇలా మాట్లాడే నేనే నిజం. నిజం ఎప్పుడూ అందంగా అద్భుతంగా ఉంటుంది. ఊహల్లోకి వెళ్ళకండి భయం పట్టుకుంటుంది అన్నారు.

  అలాగే.. రెమ్యునేషన్ గురించి చెబుతూ..నా రెమ్యూనరేషన్‌ రీజనబుల్‌. ఇంతవరకు సినిమాకి ముందు ఏ నిర్మాత వద్దా నేను సింగిల్‌ పైసా అడ్వాన్స్‌ తీసుకోలేదు. సినిమా పూర్తయ్యాకే తీసుకుంటూ వస్తున్నా అని చెప్పారు .ఇక మర్మయోగి మర్మంగురించి అడిగితే..ఆ సినిమా హై బడ్జెట్‌ కారణంగా ఆగిపోయింద నే సంగతిని మీడియాలోనే చూశాను. కమలహాసన్‌ సినిమా కాబట్టి, ఆ సినిమా చేయడానికి అంగీకరించాను అన్నారు.

  ప్రస్తుతం వస్తున్న సినిమాలపై ఇండస్ట్రీ స్క్రిప్టుల మీద మరింత దృష్టి పెట్టాలి. కొన్నిసార్లు బౌండు స్క్రిప్టులేని సినిమాలు అడపాదడపా ఆడొచ్చు. అయితే అది అన్ని సందర్భాల్లో అనుసరణీయం కాదు. సినిమా నిర్మాణంలో చాలామంది పాలుపంచుకుంటున్నారు కాబట్టి, సినిమా బాగా రావాలంటే బౌండు స్క్రిప్టులతో సెట్స్‌ మీదకు వెళ్లాలి అన్నారు.

  అలాగే ఈ మధ్య రిలీజైన 'చింతకాయల రవి' రిజల్ట్‌ పట్ల హ్యాపీగా ఉన్నారా అంటే..చాలా సంతృప్తిగానే వుంది. 'చింతకాయల రవి' వంటి ఆహ్లాదకర చిత్రం చేయడం సంతోషకరం. అదొక చక్కని ఎక్స్‌పీరియెన్స్‌. దురదృష్టవశాత్తూ ఆ సినిమా విడుదలకు ముందే టికెట్‌ రేట్లు తగ్గడం వల్ల ఆదాయం కొంతమేర తగ్గింది. అలాగే రెండో రోజే మంచి క్వాలిటీతో పైరసీ సీడీలు మార్కెట్లోకి రావడం కలెక్షన్ల మీద ప్రభావం చూపింది. అదే భారీ బడ్జెట్‌తో తీసిన సినిమా అయితే నష్టం వచ్చేది. రీజనబుల్‌ బడ్జెట్‌తో నిర్మించడం వల్ల లాభం తగ్గిందే కానీ నిర్మాతకు నష్టం తీసుకురాలేదు.

  అలాగే మేనల్లుడు నాగచైతన్య తెరంగేట్రం గురించి..నాగచైతన్యలో చక్కని టాలెంట్‌ వుంది. అయితే తనని తాను నిరూపించుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ అతనికి వుంది. నటునిగా తను సక్సెస్‌ కావాలి. మంచి ఆర్టిస్టు అనే పేరు తెచ్చుకోవాలి. ఈ విషయంలో అతనికి నా ఆశీస్సులెప్పుడూ వుంటాయి. ఇవాళ వస్తున్న యువతరంలో మంచి ఎనర్జీ కనిపిస్తోంది. కొత్తకొత్తగా ఆలోచిస్తున్నారు. కొత్త సబ్జెక్టులను ప్రయత్నిస్తున్నారు.అయినా మేము రాత్రికి రాత్రే స్టార్లం కాలేదు. శ్రమిస్తూ క్రమేణా ఈ స్థాయికి చేరుకున్నాం. 'స్వర్ణ కమలం' సినిమాలో వంటి అందమైన పాత్రలు చేశా. ఆ సినిమా ద్వారా నటునిగా చాలా నేర్చుకున్నా. 'క్షణ క్షణం' వంటి థ్రిల్లర్‌నూ, 'బొబ్బిలి రాజా' వంటి మాస్‌ ఎంటర్‌టైనర్‌నూ చేసి, మెప్పించగలిగా. నేనే కాదు.. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున మొదట్లో చాలా కష్టపడ్డారు. స్టార్‌ కావాలంటే నాగచైతన్య అయినా కష్టపడాల్సిందే. ఇక అన్న సురేష్‌ కుమారుడు రానా తెరంగేట్రం వచ్చే ఏడాది మధ్యలో తెరంగేట్రం చేయొచ్చు. అతనిలో డిసిప్లిన్‌ వుంది. పట్టుదల వుంది. అని మెచ్చుకున్నారు.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X