»   » వెంకటేష్ 'నాగవల్లి..ది రిటన్ ఆఫ్ చంద్రముఖి' రిలీజ్ డేట్ ఫిక్స్

వెంకటేష్ 'నాగవల్లి..ది రిటన్ ఆఫ్ చంద్రముఖి' రిలీజ్ డేట్ ఫిక్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

వెంకటేష్ తాజా చిత్రం "నాగవల్లి..ది రిటన్ ఆఫ్ చంద్రముఖి" ని డిసెంబర్ రెండవ తేదీన విడుదల చేయాలని నిర్ణయించారు. అలాగే ఈ చిత్రం లోగోను అక్టోబర్ 30న అరుకులో ఓ ప్రత్యేకమైన ఈవెంట్ ఏర్పాటు చేసి విడుదల చేయనున్నారు. అలాగే చిత్రం ఆడియోను నవంబర్ 10న విడుదల చేస్తారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం వెంకటేష్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా అభివర్ణిస్తున్నారు. ఇక పి.వాసు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా అనూష్క చేస్తోంది. చింతకాయల రవి తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఇదే. ఇక ఈ పీరియాడిక్ ధ్రిల్లర్ లో వెంకటేష్ వృధ్దుడు గెటప్ లో కూడా కనిపించనున్నాడని సమాచారం. బెల్లంకొండ సురేష్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. అలాగే ఈ చిత్రంలో అనూష్కతో పాటు కమలినీ ముఖర్జీ, శ్రద్ధాదాస్‌, పూనమ్ కౌర్‌, రిచా గంగోపాధ్యాయ వెంకీతో ఆడిపాడతారు సాంకేతికంగా ఉన్నత విలువలతో తీర్చిదిద్దుతున్న ఈ చిత్రంలో 'లక లక లక లక' డైలాగుని 'లీడర్‌' చిత్రంతో పరిచయమైన రిచా గంగోపాధ్యాయ చెప్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu