»   » చంద్రముఖి సీక్వెల్ హీరో వెంకటేష్ కన్ఫర్మ్

చంద్రముఖి సీక్వెల్ హీరో వెంకటేష్ కన్ఫర్మ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రజనీకాంత్ చేస్తాడా బాలకృష్ణ చేస్తాడా అంటూ గత కొద్ది రోజులుగా ఫిల్మ్ సర్కిల్స్ లో చంద్రముఖి సీక్వెల్ (ఆప్తరక్షక) గురించి ఊహాగానాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే వెంకటేష్ ని ఈ చిత్రం చేయనున్నారని అధికారికంగా నిర్మాత బెల్లంకొండ సురేష్ ప్రకటించి వీటికి తెరదించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..."కర్ణాటకలో 40కోట్లకు పైగా వసూలు చేస్తూ నూతన చరిత్ర సృష్టిస్తున్న చిత్రం 'ఆప్తరక్షక'.

ఈ చిత్రం రీమేక్‌ హక్కులను నాకందించిన నిర్మాతలకు థ్యాంక్స్‌ చెప్పుకుంటున్నాను. తెలుగులో వెంకటేష్‌ హీరోగా, పి.వాసు దర్శకత్వంలో ఈ సినిమా నిర్మించనున్నాం. ఈ చిత్రం వెంకటేష్‌ చూడగానే ఎంతో ఇన్‌ స్పైరయ్యారు. వెంటనే చేస్తానన్నారు. అంతగా ఆయన్ను ఆకట్టుకుందీ సినిమా. గతంలో పి.వాసు కథతో వెంకటేష్‌ చేసిన 'చంటి' చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం అంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుందని మా నమ్మకం. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం నిర్మించనున్నాం. మే నుంచి ఈ చిత్రాన్ని ప్రారంభిస్తాం' అని తెలిపారు. ఇక వెంకటేష్ సంక్రాంతికి రిలీజైన నమో వెంకటేశ చిత్రం అనంతరం ఒప్పుకుని చేస్తున్న చిత్రం ఇదే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu