»   »  హిరణ్య కశ్యపుడు గా వెంకీ??: మరో భారీ ప్రయత్నం మొదలుపెట్టిన గుణశేఖర్

హిరణ్య కశ్యపుడు గా వెంకీ??: మరో భారీ ప్రయత్నం మొదలుపెట్టిన గుణశేఖర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రుద్రమ‌దేవి' తర్వాత కొత్త సినిమా డేట్ ప్రకటించలేదు గుణ శేఖర్. రుద్రమ‌దేవి త‌ర‌వాత ప్రతాప‌రుద్రుడు అనే ప్రాజెక్టు ప‌ట్టాలెక్కిద్దామ‌నుకొన్నారు. అయితే కొన్ని కారణాలవల్ల కుదరలేదు. చరిత్రని పరిశోదించి మరీ తాయారు చేద్దామనుకున్న కథ పూర్తికాలేదనీ, ముందు చేద్దామంటూ మాటిచ్చిన నిర్మాత తర్వాత హ్యాండిచ్చాడనీ వార్తలొచ్చాయి గానీ అవి నిజాలా రూమర్లా అన్న క్లారిటీ అయితే లేదు. ఆ ప్రాజెక్ట్ ఇక ఇప్పట్లో కుదరదు అనుకున్నతర్వాత., 'హిరణ్య కశ్యప'పేరుతొ మరో పిరియాడికల్ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం మొదలు పెట్టాడు గుణశేఖర్.

100 కోట్లు బడ్జెట్

100 కోట్లు బడ్జెట్

మొదట్లో ఎన్టీఆర్ అనీ, కొన్నాళ్ళ తర్వాత రానా అనీ అన్నారుగానీ ఇప్పుడు మాత్రం విక్టరీ వెంకటేష్ ని ప్రధాన పాత్రగా తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమాని అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో తీయాల‌ని గుణ ఫిక్స‌య్యాడు. ఈ సినిమా కోసం దాదాపుగా రూ.100 కోట్లు ఖ‌ర్చు పెట్టాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

విక్టరీ వెంకటేశ్

విక్టరీ వెంకటేశ్

ఈ సినిమాలో సురేష్ బాబు కూడా నిర్మాణ భాగ‌స్వామిగా ఉంటాడ‌ని స‌మాచారం. భాగవతంలో భక్త ప్రహ్లాదుని గాథ సుప్రసిద్ధం- అతని కన్న తండ్రి హిరణ్య కశ్యపుడు, సొంత కొడుకునే శిక్షలు గురిచేసిన దానవుడు. అలాంటి హిరణ్య కశ్యపునిగా టైటిల్ రోల్‌ను విక్టరీ వెంకటేశ్ పోషించబోతున్నట్లు సమాచారం. ఇంతవరకూ పౌరాణిక పాత్రలను చేయని వెంకీ గుణశేఖర్ కథ విని హిరణ్య కశ్యప పాత్ర పోషించడానికి పాజిటివ్‌గా స్పందించాడట.

ప్రీ ప్రొడక్షన్ వర్క్

ప్రీ ప్రొడక్షన్ వర్క్

ప్రస్తుతం 'హిరణ్య కశ్యప'.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ప్రహ్లాదుడి పాత్రతో పాటు మిగతా కాస్ట్ అండ్ క్రూను త్వరలో ఎంపిక చేయనున్నాడట డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గుణశేఖరే. మొత్తంమీద ఒకప్పుడు 'రామాయణం'ను బాలలతో తీసి విజయాన్ని సాధించిన గుణశేఖర్ ఈ పౌరాణిక గాథను వెండితెరపై ఎలా మలుస్తాడో చూడాల్సి ఉంది.

ప్రీ ప్రొడక్షన్ వర్క్

ప్రీ ప్రొడక్షన్ వర్క్

ప్రస్తుతం 'హిరణ్య కశ్యప'.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ప్రహ్లాదుడి పాత్రతో పాటు మిగతా కాస్ట్ అండ్ క్రూను త్వరలో ఎంపిక చేయనున్నాడట డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గుణశేఖరే. మొత్తంమీద ఒకప్పుడు 'రామాయణం'ను బాలలతో తీసి విజయాన్ని సాధించిన గుణశేఖర్ ఈ పౌరాణిక గాథను వెండితెరపై ఎలా మలుస్తాడో చూడాల్సి ఉంది.

త్వరలోనే మరిన్ని విషయాలు

త్వరలోనే మరిన్ని విషయాలు

అంతే కాదు హిరణ్య కశ్యపుని పాత్రను అనన్య సామాన్యమైన రీతిలో పోషించి తెలుగువారి మదిలో చెరగని ముద్రవేసిన ఎస్వీ రంగారావును వెంకటేశ్ ఎలా మరపిస్తాడో చూడాలి. త్వరలోనే ఈ భారీ చిత్రానికి సంబంధించి మరిన్ని విషయాలు వెల్లడించనున్నారు.

English summary
Gunasekhar is planning to cast Venky in this next mythological film, in the Hiranya Kashyapa role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu