twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్రమత్తంగా లేకపోవడం హానికరమే.. అసలు కథ ఇదే..నోరు విప్పిన వెంకీ కుడుముల

    |

    గత రెండ్రోజులు భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుముల వార్తల్లో వైరల్ అవుతూనే ఉన్నాడు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన భీష్మ డైరెక్టర్.. అవార్డు ఇప్పిస్తామని చెప్పడంతో మోసపోయిన డైరెక్టర్ అంటూ ఇలా రకరకాలుగా వార్తలు వచ్చాయి. అయితే ఇందులో వెంకీ కుడుములపై కాస్త ట్రోలింగ్ కూడా జరిగింది. అయితే ఈ ఘటన ఎలా జరిగింది, అందులో నిజానిజాలేంటనే విషయాలను తాజాగా వెంకీ కుడుముల బయటకు చెప్పేశాడు. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశాడు. అందులో ఏముందంటే..

    మరొకరికి ఇలా..

    మరొకరికి ఇలా..

    కొన్ని రోజులు క్రితం నేను పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు రకరకాల వార్తలు, రూమర్లు నా మీద వస్తున్నాయి. నేను మోసపోయాను అని తెలిసి కూడా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉంటే ఇది మిగతా వారికి కూడా జరిగే ప్రమాదం ఉంది.. ఎవరికీ తెలియకుండా అలా వదిలేయడం లేదా.. మరోకరికి ఇలా జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకునే దారులుంటాయి. నేను రెండోది ఎంచుకున్నాను అంటూ వెంకీ కుడుముల చెప్పుకొచ్చాడు.

     మ్యూచువల్ ఫ్రెండ్..

    మ్యూచువల్ ఫ్రెండ్..

    నాకు తెలిసిన స్నేహితుడి వద్ద నుంచి నంబర్ తీసుకుని నవీన్ అనే వ్యక్తి కాల్ చేశాడు. అతనికి భీష్మ చిత్రం నచ్చింది.. ఆర్గానిక్ వ్యవసాయాన్ని ఆధారం చేసుకుని తెరకెక్కించిన సినిమా కాబట్టి..జాతీయ అవార్డు కోసం ప్రయత్నించమని సలహా ఇచ్చాడు. అలా అప్లై చేయడంలో ఎలాంటి తప్పుకూడా లేదు. నేను దరఖాస్తు చేశానంటూ వెంకీ కుడుముల అసలు విషయం చెప్పసాగాడు.

     డబ్బులు కట్టాను..

    డబ్బులు కట్టాను..

    అలా నాకు తెలిసిన మ్యూచువల్ ఫ్రెండ్‌తో టచ్‌లోకి వచ్చాను.. నవీన్ అనే వ్యక్తి తెలుసా? అని అడిగాను. రెండేళ్లుగా తెలుసు అని చెప్పాడు. అలా చెప్పడంతో నా అసోసియేట్ డైరెక్టర్‌కు చెప్పి అప్లై చేయించాను. కావాల్సిన డాక్యుమెంట్స్‌ను చూడమన్నాను. అప్లికేషన్ ఫీ కోసం దాదాపు రూ. 63, 600 కట్టాను. మళ్లీ ఆ తరువాత ఇంకొంత కట్టాలి. మనకు రీ ఫండ్ వస్తుందని చెప్పడంతో అనుమానం వచ్చిందంటూ వెంకీ కుడుముల చెప్పుకొచ్చాడు.

    రెండేళ్లుగా మెసెజ్‌లు..

    రెండేళ్లుగా మెసెజ్‌లు..

    అలా అనుమానం రావడంతో బ్యాండ్ అకౌంట్ ఖాతా గురించి వివరాలు తెలుసుకున్నాను.. అయితే అది ఏదైనా ఓ సినిమా ఆర్గనైజేషన్ పేరుతో ఉండాలి. కానీ ఒకరి పేరు మీద ఆ ఖాతా ఉంది. ఇక నా మ్యూచువల్ ఫ్రెండ్‌కు ఫోన్ చేసి నవీన్ గురించి మళ్లీ అడిగాను.. నేరుగా ఎప్పుడూ కలవలేదు. రెండేళ్లలో అప్పుడప్పుడు మెసెజ్‌లు మాత్రమే చేస్తుండేవాడిని అని చెప్పాడంటూ అసలు మోసం ఎలా జరిగిందో వెంకీ కుడుముల తెలిపాడు.

    నాలా ఇంకొకరు..

    నాలా ఇంకొకరు..

    ఇలాంటి మోసాలు చేసేవారు ఎలా అయినా వస్తుంటారు.. అయితే దీని గురించి ఫిర్యాదులు ఏమీ ఇవ్వకండని ఫ్రెండ్స్ అందరూ సలహాలు ఇచ్చారు.. కానీ నేను మాత్రం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాను.. ఇవ్వకుండా ఎలా ఉండగలను.. అలా ఫిర్యాదు చేస్తేనే ఇంకోసారి ఇలాంటి పనులు చేయకుండా ఉంటారు.. నాలా ఇంకొకరు మోసపోరు.. అంటూ వెంకీ కుడుముల చెప్పుకొచ్చాడు.

    అది కూడా హానికరమే..

    అది కూడా హానికరమే..

    తప్పు జరిగితే.. తప్పు జరిగింది ఇలా మిగతా వాళ్లకు ఇలా జరగకూడదని కంప్లైంట్ చేయడంలో తప్పు లేదు అనిపించింది.. పొగ తాగుట, మద్యం సేవించుటే కాదు.. అప్రమత్తంగా లేకపోవడం కూడా హానికరమే.. సమాజంలో తప్పు జరిగితే కచ్చితంగా మీ గొంతుకను వినిపించండని వెంకీ కుడుముల అసలు విషయాలన్నీ బయటకు చెప్పేశాడు.

    English summary
    Venky Kudumula about Cheated by Cyber Theft,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X