For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అవును..హిందీ చిత్రం రీమేక్ చేస్తున్నాను: వెంకటేష్

  By Srikanya
  |

  హైదరాబాద్ :" అవును, నేను రామ్ కలిసి బోల్ బచ్చన్ రీమేక్ ని తెలుగులో చేస్తున్నాం. సినిమా టైటిల్,దర్శకుడు ఇంకా ఫైనల్ కాలేదు. వచ్చే సంవత్సరంలో చిత్రం ప్రారంభం అవుతుంది ." అని తేల్చి చెప్పారు వెంకటేష్. గత కొద్ది రోజులుగా వెంకటేష్ , రామ్ కాంబినేషన్ లో మరో మల్టి స్టారర్ గా బోల్ బచ్చన్ రీమేక్ అవుతుందంటూ వార్తలు వచ్చాయి. అయితే అవి కొందరు రూమర్స్ అని కొట్టిపారేసారు. అయితే తాజాగా వెంకటేష్ తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని చెప్పి,రూమర్స్ ని నిజం చేసారు.

  ప్రముఖ నిర్మాత స్రవంతి రవి కిషోర్ ఈ చిత్రం రైట్స్ తీసుకుని రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సురేష్ బాబు కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం అయ్యే అవకాసం ఉంది. గతంలో ఇదే బ్యానర్ లో చేసిన ప్రముఖ దర్శకుడు విజయభాస్కర్ ఈ చిత్రాన్ని తెరెకెక్కించటానికి సంసిద్దమవుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఆఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుంది.

  ఇక రామ్ బదులు రానా ని తీసుకోవచ్చుగా అని వెంకటేష్ ని మీడియా వారు అడగ్గా.. " రానా చాలా పొడవు..బాడీని బాగా బిల్డ్ చేసుకున్నవాడు. అతను నా ప్రక్కన నిలబడితే,నా కన్నా చాలా స్ట్రాంగ్ గా కనపడతాడు. కథ ప్రకారం అది వర్కవుట్ కాదు. అందుకే ఆ పాత్రకు రామ్ అయితేనే మంచి ఆప్షన్ అనుకుంటున్నాం ." అన్నారు.

  అలాగే తనకు రామ్ నటించిన రెడీ,కందిరీగ చిత్రాలు బాగా నచ్చాయన్నారు. రామ్ ఫెరఫార్మెన్స్, కామెడీ టైమింగ్ బాగుంటుందని చెప్పారు. అతను అభిషేక్ బచ్చన్ పాత్రకు కరెక్టుగా సూట్ అవుతారని వెంకటేష్ అన్నారు. ఇక ప్రస్తుతం..రామ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా లిమిటెట్ పతాకంపై 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో 'ఒంగోలు గిత్త' చిత్రం చేస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నఈ చిత్రం ఫ్యామిలీ టచ్‌తో మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది.

  బోల్ బచ్చన్ లో అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, అసిన్, ప్రచీ దేశాయ్, అస్రానీ, అర్చనా పూరణ్‌సింగ్ తదితరులు నటించారు. సంగీతం హిమేష్ రేషమ్మియా అందించారు.'గోల్ మాల్' సిరీస్ హిట్ కామెడీలు తీస్తున్న దర్శకుడు రోహిత్‌శెట్టి డైరక్ట్ చేసారు. హీరో అజయ్ దేవగన్ నిర్మించారు. అయితే ఈ చిత్రం హృషికేశ్ ముఖర్జీ హిట్ 'గోల్ మాల్' (1979) కి రీమేక్ కావటం విశేషం. కామెడీ ఆఫ్ ఎర్రర్స్,పంచ్ డైలాగ్స్ తో ఈ చిత్రం నవ్విస్తూ సాగుతుంది. బాలీవుడ్ లో ఈ చిత్రం మంచి కలెక్షన్స్ వసూలు చేసింది.

  English summary
  
 Ram and Venkatesh will star in the Telugu remake of Bol Bachchan starring Ajay Devgn and Abhishek Bachchan. Venkatesh tells , "Yes, we are both doing the remake of Bol Bachchan in Telugu. The title of the movie and the director has not been finalised yet. This film will start rolling next year." The actor says he enjoyed Ram's performance in Ready and Kandireega. "Ram is perfect for Abhishek Bachan's character. He has a good comic timing," adds Venkatesh.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X