»   » వెంకటేష్ బాగా చేసారా..మిగతా వాళ్లా...మీరే చెప్పండి? (వీడియోలు)

వెంకటేష్ బాగా చేసారా..మిగతా వాళ్లా...మీరే చెప్పండి? (వీడియోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకే సినిమా వివిధ భాషల్లో కి రీమేక్ అయితే ఖచ్చితంగా నటుల మధ్య పోలిక వస్తుంది. ఎవరు బాగా చేసారు..ఎవరు ఎమోషన్స్ బాగా పండించారు అనే విషయంపై చర్చ జరుగుతుంది. తాజాగా అన్ని భాషల్లోకి రీమేక్ అవుతున్న చిత్రం దృశ్యమ్. ఈ చిత్రం తెలుగు వెర్షన్ లో వెంకటేష్ హీరోగా చేసారు. దీని ట్రైలర్ రీసెంట్ గా విడుదలైంది. అలాగే రెండు వారాల క్రితం రవిచంద్రన్ హీరోగా కన్నడంలో ఈ చిత్రం రీమేక్ అయ్యింది. అంతకు ముందు మళయాళంలో మోహన్ లాల్ చేసారు. ఎవరు బాగా చేసారు అన్నది .... కేవలం ట్రైలర్స్ ఆధారంగా నిర్ణయించలేం కానీ..ఒకే విధంగా దాదాపు మక్కికి మక్కి దింపినట్లున్న ఈ ట్రైలర్స్ చూసి సరదాగా అంచనా వెయ్యిండి. క్రింద కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను పంచుకోండి.

మొదటగా తెలుగులో వెంకటేష్ దృశ్యం ట్రైలర్

<iframe width="560" height="315" src="//www.youtube.com/embed/MpGoLXLQu_0" frameborder="0" allowfullscreen></iframe>

మళయాళంలో మోహన్ లాల్ దృశ్యమ్ ట్రైలర్

<iframe width="560" height="315" src="//www.youtube.com/embed/eMASubc1y_k" frameborder="0" allowfullscreen></iframe>

కన్నడంలో రవిచంద్రన్ నటించిన దృశ్యమ్ ట్రైలర్...

<iframe width="560" height="315" src="//www.youtube.com/embed/OiBn5hq-huM" frameborder="0" allowfullscreen></iframe>


కనిపించేదంతా నిజం కాదు అనే ట్యాగ్ లైన్ తో వెంకటేష్ తాజా చిత్రం 'దృశ్యం‌' ఫస్ట్ లుక్ వచ్చి అందరి మన్ననలూ పొందింది. మలయాళంలో మోహన్‌లాల్‌ నటించిన 'దృశ్యమ్‌' సినిమాని తెలుగులో వెంకటేష్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీప్రియ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేష్ సరసన మీనా నటిస్తున్న జూలై 11 న విడుదల చేయటానికి నిర్ణయించారు.

నిర్మాత మాట్లాడుతూ...''గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు.. వాటి వల్ల ఆయా కుటుంబ సభ్యులు పడుతున్న ఇబ్బందుల్ని కళ్లకు కట్టేలా దర్శకురాలు తీర్చిదిద్దుతున్నారు. అనేక సమకాలీన అంశాల్ని చిత్రంలో పొందుపరుస్తున్నారు. తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధాన్ని చూపే సన్నివేశాల్ని దర్శకురాలు చక్కగా తెరకెక్కిస్తున్నారు'' అంటున్నారు.

మీనా హీరోయిన్ గా చేసే ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్‌ థియేటర్స్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌, వైడ్‌ యాంగిల్‌ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాజ్‌కుమార్‌ సేతుపతి నిర్మాత. డి.సురేష్‌బాబు సమర్పకులు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం వైజాగ్ లోని అందమైన లొకేషన్స్‌లో జరుగుతోంది. చిత్ర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. చిత్రంలో నదియా ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. త్వరలో సినిమా పేరుని ప్రకటిస్తారు.

venky's Drishyam - Theatrical Trailer


వెంకటేష్ మాట్లాడుతూ.... ఇక్కడ ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకోలేం. ఎంతసేపూ సురక్షితంగానే ప్రయాణం చేయాలి. ఆ పంథాలో ఆలోచించినప్పుడే రీమేక్‌ సినిమాలు తెరకెక్కుతుంటాయి. అయినా రీమేక్‌ చేయడం తప్పేం కాదు. మంచి సినిమా అనుకొన్నప్పుడు... దాన్ని మన ప్రేక్షకులకు కూడా అందేలా చేయాలి. అలా చేసిన ప్రతీసారీ నాకు విజయం దక్కింది.

నేనే కాదు... హీరోల్లో చాలామంది రీమేక్‌ సినిమాలు చేశారు. కాకపోతే వాటిలో నాకు ఎక్కువ విజయాలున్నాయి. ఇటీవల పొరుగు భాషల్లోని హీరోలు సైతం రీమేక్‌ సినిమాలపై దృష్టి కేంద్రీకరించారు. హిందీలో సల్మాన్‌ఖాన్‌ మన తెలుగు కథలతో విజయాలు అందుకొంటున్నాడు. కథలు వినిపించడానికి చాలామంది వస్తుంటారు. అయితే... ఆ కథలు ప్రేక్షకులకి ఎలా చేరతాయనే విషయం గురించి ఆలోచించాలి. అప్పుడే సరైన ఫలితాలొస్తాయి అన్నారు.

English summary
Drushyam is an upcoming Telugu film directed by Sripriya and jointly produced by Suresh Productions, Rajkumar Theaters Pvt Ltd and Wide Angle Creations. Starring Venkatesh and Meena in the lead roles, The film is a remake of the 2013 Malayalam blockbuster Drishyam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu