»   » ఆయనే "గురు"వు గారు: విక్టరీ వెంకటేష్ కి ఇదే ఫైనల్ అట

ఆయనే "గురు"వు గారు: విక్టరీ వెంకటేష్ కి ఇదే ఫైనల్ అట

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ లో మాధవన్ హీరోగా తెరకెక్కిన సాలా ఖడూస్ ని తెలుగులో విక్టరీ వెంకటేష్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వెంకీ బాక్సింగ్‌ కోచ్‌గా నటించనున్నాడు. బాబు బంగారంతో సక్సెస్ కి దగ్గరగా వచ్చి ఆగిపోయిన వెంకీ.. ఈ సారి తనకు అచ్చొచ్చిన రీమేక్ తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. దాంతో వెంకీ గత కాలంగా బాక్సింగ్‌ కోచింగ్‌ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇంతకీ ఈ కథ ఏమిటంటే మాధవన్ పోషించిన బాక్సింగ్ కోచ్ పాత్రనే తెలుగులో వెంకీ చేయబోతున్నారు.

ఒరిజినల్లో నటించిన రితికా సింగే ఇక్కడా అదే పాత్రలో కనిపిస్తుంది. ఎంతో టాలెంట్ ఉన్నా.. బాక్సింగ్ రాజకీయాల వల్ల ఛాంపియన్ కాలేకపోయిన కథానాయకుడు.. కోచ్ గా మారి మట్టిలో మాణిక్యాలను వెలికి తేవాలనుకుంటాడు. అలా ఓ పేద కుటుంబానికి చెందిన గడుసు పిల్లను ఛాంపియన్ చేయడానికి నడుం బిగిస్తాడు. తెలుగు వెర్షన్ వైజాగ్ బ్యాగ్రౌండ్లో సాగుతుందని సమాచారం. అయితే ప్రాక్టీస్ మొదలు పెట్తిన వెంకీ చిన్న ఇబ్బందులు తలెత్తతం తో డాక్టర్లను ఆశ్రయించిన వెంకీ షాక్‌ తిన్నాడు. ఈ వయస్సులో అంత కష్టమైన బాక్సింగ్‌ అంత మంచిది కాదని డాక్టర్‌లు వెంకీతో చెప్పారట.

సినిమాలో వెంకటేష్ బాక్సింగ్ కోచ్ గా నచించనుండడంతో.. ఈ సినిమాకి గురు పర్ఫెక్ట్ టైటిల్ అని భావిస్తున్నారట ఈ టైటిల్ నే ఫైనల్ చేయబోతున్నారు అని సమాచారం. . వెంకీ గురువుగా నటించే ఈ మూవీలో.. ఆయనకి శిష్యురాలిగా రితికా సింగ్ నటించనుంది. ఈ అమ్మాయికి ఇదే తొలి తెలుగు సినిమా కాగా.. ఒరిజినల్ వెర్షన్ లో కూడా ఈమే యాక్ట్ చేసింది. ఈ ఒక్క పాత్రతో హిందీ.. తమిళ్ తో పాటు తెలుగులోనూ రితికా సింగ్ అరంగేట్రం చేసేస్తుండడం విశేషం.

దాంతో వెంకీ కాస్త ఆలోచనలో పడ్డాడు. ఆ తర్వాత డాక్టర్‌లు కాస్త జాగ్రత్తగా ఈ కసరత్తులు చేస్తే అంత ప్రమాదం ఏమి ఉండదని సూచించారట. దాంతో వెంకీ డాక్టర్ల సూచనల మేరకు కసరత్తులు చేస్తున్నాడు. ఈ వయస్సులో కూడా వెంకీ ఇలాంటి చిత్రాలు చేయడగానికి ఒప్పుకున్నందుకు ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. తన చిత్రం కోసం ఏది చేయడానికైన సిద్దంగా ఉన్న వెంకీ ఈ చిత్రంతో కాస్త రిస్క్‌ తీసుకుంటున్నాడు కాని అది డాక్టర్‌ల సమక్షంలో కాబట్టి అంత ప్రమాదం ఏముండదని అభిమానులు భావిస్తున్నారు.

English summary
That Victory Venkatesh would be starring in the Telugu remake of the critically acclaimed sports drama Saala Khadoos is a known news. According to the fresh update from close industry sources, the Telugu version has been titled ‘Guru’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu