»   » ఒకప్పుడు బ్రహ్మీకోసం రాసే వారు... ఇపుడు ఆస్థానంలో ఎవరో తెలుసా?

ఒకప్పుడు బ్రహ్మీకోసం రాసే వారు... ఇపుడు ఆస్థానంలో ఎవరో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్లో బ్రహ్మానంతం స్థానం ఏమిటో? రేంజి ఏమిటో? అందరికీ తెలిసిందే. బ్రహ్మీ కోసం సినిమాల్లో ప్రత్చేకంగా కామెడీ పాత్రలు క్రియేట్ చేసే వారు. అయితే రాను రాను బ్రహ్మానందం క్రేజ్ తగ్గిపోతోంది. ఆ స్థానాన్ని బర్తీ చేస్తున్న కమెడియన్ ఎవరైనా ఉన్నారా? అంటే అది వెన్నెల కిషోరే అంటున్నారు అంతా.

ఈ మధ్య కాలంలో కమెడియన్ వెన్నెల కిషోర్‌ హిలేరియస్‌గా నవ్వించిన చిత్రాలు సూప‌ర్‌డూప‌ర్ హిట్స్ గా నిలుస్తున్నాయి. భ‌లేభ‌లేమ‌గాడివోయ్‌, ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా, మ‌జ్ను లాంటి చిత్రాల్లో వెన్నెల కిషోర్ త‌న‌దైన శైలిలో ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బా న‌వ్వించారు.

 విన్నర్ మూవీలో

విన్నర్ మూవీలో

తనదైన డైలాగ్ పంచ్‌ల‌తో... తనదైన మాడ్యులేష‌న్స్ తో... కడుపుబ్బ నవ్విస్తున్న హాస్యనటుడు వెన్నెల కిషోర్‌.. విన్నర్ చిత్రంలోనూ ప‌ద్మ పాత్ర‌లో న‌వ్వించబోతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఆయ‌న చేసిన పాత్ర‌ల‌కి విభిన్నంగా దర్శకుడు గోపిచంద్ మలినేని మరో అద్భుతమైన కామెడీ పాత్రను రాసారు.

 24న రిలీజ్

24న రిలీజ్

సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ల‌క్ష్మీన‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై రూపొందిన చిత్రం 'విన్నర్'. బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్నిర్మించారు. హార్స్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 24న అన‌గా ఈ శుక్ర‌వారం అత్యధిక థియేటర్లలో విడుదలకానుంది.

 నటీనటులు, తారాగణం

నటీనటులు, తారాగణం

సాయిధ‌ర‌మ్‌తేజ్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్ జంట‌గా న‌టించిన ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు, ముకేష్ రుషి, ఆలీ, వెన్నెల‌ కిశోర్ త‌దిత‌రులుఇతర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు, సంగీతం: త‌మ‌న్‌, ఆర్ట్: ప్ర‌కాష్‌, క‌థ‌: వెలిగొండ శ్రీనివాస్‌,మాట‌లు: అబ్బూరి ర‌వి, నృత్యాలు: రాజు సుంద‌రం, శేఖ‌ర్‌, ఫైట్స్: స్ట‌న్ శివ‌, ర‌వివ‌ర్మ‌, ఎడిట‌ర్‌: గౌత‌మ్ రాజు, స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్వం:గోపీచంద్ మ‌లినేని.

 విన్నర్ మూవీలో చేయడానికి ముందు భయ పడ్డా... ఒప్పుకోవడానికి కారణం అదే: అనసూయ

విన్నర్ మూవీలో చేయడానికి ముందు భయ పడ్డా... ఒప్పుకోవడానికి కారణం అదే: అనసూయ

నేను పాట పాడ‌టానికి రికార్డింగ్ స్టూడియో చేరుకునే వరకు నేను పాడ‌బోయే పాట అన‌సూయ డ్యాన్స్ నెంబ‌ర్ సాంగ్ అని నాకు కూడా తెలియ‌దు. థ‌మ‌న్ ఇచ్చిన లిరిక్స్‌లో సూయ సూయ అనే పాట ప‌ల్ల‌వి చ‌ద‌వ‌గానే ఇది అన‌సూయ కోసం రాసిన పాట క‌దా..అని అడ‌గ‌డంతో థ‌మ‌న్.. నిజమే అన్నారు.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

/news/anasuya-suma-winner-movie-interview-056757.html

English summary
Tollywood comedian Vennela Kishore play Padma role in Winner movie. Winner is an upcoming Telugu Action film, jointly produced by Nallamalupu Bujji, Tagore Madhu on Sri Lakshmi Narasimha Productions & Leo Productions banner and directed by Gopichand Malineni. Starring Sai Dharam Tej, Rakul Preet Singh in the lead roles, Jagapati Babu in crucial role and music composed by S. Thaman.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu