twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మ కూతుర్నంటూ ఇరవై ఏళ్ళ అమ్మాయి..

    By Srikanya
    |

    హైదరాబాద్ : పెళ్లి వద్దని లైఫ్ ని అనుభవిస్తున్న వర్మ అనే ఓ సెలబ్రిటీ జీవితంలో అనూహంగా ఓ చిత్రం చోటు చేసుకుంటుంది. అనూహ్యంగా తాను అతని కూతుర్నంటూ ఓ ఇరవై ఏళ్ల యువతి వస్తుంది. అప్పుడు ఆ ఇద్దరి మధ్య చోటు చేసుకున్న సంఘర్షణే 'డాటర్ ఆఫ్ వర్మ' సినిమా ఇతివృత్తం. వెన్నెల కిశోర్, నవీనా జాక్సన్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న ఈ చిత్రానికి 'స్టోరీ ఆఫ్ ఎ సెలబ్రిటీ' అనేది ఉప శీర్షిక. కథ ప్రకారం ఒక రేడియో జాకీ తన పేరును రాంగోపాల్ వర్మగా పెట్టుకుంటాడు. అతడు, అతడి కూతురుకు సంబంధించిన కథే 'డాటర్ ఆఫ్ రాంగోపాల్ వర్మ'. నిజజీవితంలోనూ దర్శకుడు రాంగోపాల్ వర్మకు కూడా ఒక కూతురు ఉంది. ఆమె పేరు రేవతి.

    దర్శకుడు ఖాజా మాట్లాడుతూ "ఆద్యంతం ఆసక్తికరమైన సంఘటనలతో ప్రేక్షకులకు ఈ సినిమా సరికొత్త అనుభూతినిస్తుంది. షూటింగ్, డబ్బింగ్, ఎడిటింగ్ పనులు పూర్తయిన ఈ చిత్రానికి సంబంధించి తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో డీటీయస్ పనుల్నీ పూర్తి చేశాం. త్వరలో పాటల్నీ, చిత్రాన్నీ ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.

    వెన్నెల కిషోర్ హీరోగా రూపొందుతున్న మరో చిత్రం 'D/o రామ్ గోపాల్ వర్మ'. నాటక రంగలో 9 నంది వార్డులు పొందిన ఖాజా దర్శకత్వంలో రూపొందనున్న ఈచిత్రంలో నవీన జాక్సన్, ఆరాస్ పిమేల్ లీడ్ రోల్స్ చేయనున్నారు. ఫర్ ఎవర్ ఫెంటాస్టిక్ ఫిలింస్ బేనర్ పై బొక్కా నరేంద్రరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న ఈచిత్రం సెన్సార్ బోర్డు నుంచి చిక్కులు ఎదుర్కొంటోంది. ఈ చిత్రం టైటిల్ మార్చాలని బోర్డు సభ్యులు ఆదేశించినట్లు సమాచారం. ఈ దీంతో టైటిల్ 'D/o వర్మ' గా మార్చే అవకాశం కనిపిస్తోంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పేరు పెట్టడం వల్ల ఫిర్యాదులు వస్తాయనే కారణంతో సెన్సార్ బోర్డులు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఈ సినిమా టైటిల్ పట్ల ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఎలాంటి అభ్యంతరాలు లేవని ఖాజా స్పష్టం చేసారు

    కవితా ఆరస్, రోజా, జీవా, ఉత్తేజ్, ధనరాజ్, తాగుబోతు రమేశ్, మేల్కోటే, జోగినాయుడు, ఫిష్ వెంకట్, 'సై' షానీ, మాస్టర్ వీరేన్ తారాగణమైన ఈ చిత్రానికి సహ రచయిత: శేఖర్ పాల, పాటలు: సురేశ్-బాలు, ఆదేశ్ రవి, సంగీతం: ఆదేశ్ రవి, ఛాయాగ్రహణం: పి.జి. విందా, కూర్పు: ప్రవీణ్ పూడి, కొరియోగ్రఫీ: రాజన్న, కళ: పి.ఎస్. శర్మ, లైన్ ప్రొడ్యూసర్: నగేశ్ లావురి.

    English summary
    The DTS work of 'Daughter of Varma' movie has been completed along with dubbing and editing in Annapurna studios. The shooting part has already been completed. 'Vennela' Kishore is playing the lead role in the film and it is directed by Khaja. Bokka Narendar Reddy is producing the film under 'Forever fantastic films' banner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X