»   » ఔను నాకు ఇండస్ట్రీ లో ఎఫైర్లున్నాయి, ఆ సినిమాలు నేనే వదులుకున్నా : వేణూమాధవ్

ఔను నాకు ఇండస్ట్రీ లో ఎఫైర్లున్నాయి, ఆ సినిమాలు నేనే వదులుకున్నా : వేణూమాధవ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

వేణు మాధవ్... పరిచయం అవసరం లేని పేరు. మొన్నటి వరకు బిజి బిజీగా చాలా సినిమాలు చేసిన వేణు ఇప్పుడు సడన్ గా సినిమాలు మానివేయడంతో ఆరోగ్యం భాలేదని మొదట్లో పుకర్లు షికార్లుగా సాగాయి. కానీ ఇప్పుడు ఏకంగా వేణుమాధవ్ చనిపోయాడంటు కొన్ని వెబ్ సైట్స్ మరియు చానల్స్ వార్తలను ప్రచారం చేసాయి. నిజ, నిజాలు తెలుసుకోకుండా ప్రచారం చేయడంతో మనో వేదనకు గురయ్యానని,

ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుషాయిగూడ పోలీసులను వేణు మాధవ్ కోరారు. అదే సమయం లో తమిళ కమెడియన్ సెంథిల్ కి కూడ ఇలాంటి పరిస్థితి రావడంతో వెంటనే తను మీడియ ముందుకు వచ్చి వివరణ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర విశేషాలు చెప్పాడు.

ఎఫైర్లు మాత్రం ఉన్నాయి:

ఎఫైర్లు మాత్రం ఉన్నాయి:

"నా గురించి ఎన్ని దుష్ప్రచారాలు జరిగినా ఊరుకున్నాను. కానీ ఏకంగా చనిపోయాడని వార్తలు వచ్చేసరికే తట్టుకోలేకపోయాను. అందుకే కేసులు పెట్టే వరకు వెళ్లాను. నేనేదో రెండు మూడు పెళ్లిళ్లు కూడా చేసుకున్నట్లు వార్తలు సృష్టించారు. కానీ అలాంటిదేమీ లేదు. నాకున్నది ఒకటే ఫ్యామిలీ. రెండు మూడు ఫ్యామిలీలేమీ లేవు. కానీ ఎఫైర్లు మాత్రం ఉన్నాయి.

చాలామంది అమ్మాయిలతో:

చాలామంది అమ్మాయిలతో:

అది ఒప్పుకుని తీరాలి. నాకు బయట చాలామంది అమ్మాయిలతో పరిచయాలున్నాయి. ఇండస్ట్రీలో మాత్రం అందరితోనూ సక్రమమైన సంబంధాలే ఉన్నాయి. హీరోయిన్లలో స్నేహ దగ్గర్నుంచి ఇప్పటి హీరోయిన్ల వరకు అందరితో మంచి రిలేషన్ ఉంది. ఇక నా ఆరోగ్యం గురించి ఎన్ని ప్రచారాలు చేశారో లెక్కలేదు. నాకు ఎయిడ్స్ అన్నారు. క్యాన్సర్ అన్నారు.

వరుసగా షూటింగుల్లో :

వరుసగా షూటింగుల్లో :

దంతా నేను రచ్చ షూటింగ్ సందర్భంగా కింద పడిపోవడంతో వచ్చిన సమస్య. ఆ ముందు రోజు రాత్రి డిన్నర్ చేయలేదు. ఉదయం టిఫిన్ చేయలేదు. వరుసగా షూటింగుల్లో పాల్గొనడం వల్ల కళ్లు తిరిగి కింద పడ్డాను తప్ప ఇంకేమీ కాదు" అని వేణుమాధవ్ అన్నాడు.

పెద్ద ఎన్టీఆర్ సూచన తో:

పెద్ద ఎన్టీఆర్ సూచన తో:

వేణుమాధవ్ పుట్టింది నల్గొండ జిల్లా లోని కోదాడ లో పుట్టాడు.తన కెరీర్ ని ఒక మిమిక్రీ ప్రోగ్రామ్స్ తో స్టార్ట్ చేసి చాల ఫేమస్ అయ్యాడు. ఒక ప్రోగ్రాం లో సీనియర్ ఎన్టీఆర్ ముందు వేణుమాధవ్ ఇచ్చిన మిమిక్రీ తో ఇంప్రెస్స్ అయ్యిన ఎన్టీఆర్ బ్రదర్ మీరు మూవీస్ లో ట్రై చేయండి ఫ్యూచర్ లో మంచి కమెడియన్ అవుతారు అని అనడం తో సీరియస్ గా మూవీస్ లో చాన్సులకోసం తీరగడం మొదలెట్టాడు .

తొలి ప్రేమ సినిమాలో:

తొలి ప్రేమ సినిమాలో:

అలా 1996 డైరెక్టర్ ఎస్వీ కృష్ణా రెడ్డి డైరెక్ట్ చేసిన సంప్రదాయం మూవీ ద్వారా తెలుగు తెరకి పరిచయం అయ్యాడు వేణు మాధవ్ , ఆ తరువాత 1997 లో చిరంజీవి నటించిన మాస్టర్ మూవీ లోను ఒక పాత్ర పోషించాడు.ఆ తరువాత వచ్చిన పవన్ కళ్యాణ్ నటించిన తొలి ప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ పాత్ర చేసి అందరిని మెప్పించి మంచి కమెడియన్ గా రాజ్యం మేలాడు .

పిల్లలు పెద్దవాళ్లయ్యారు:

పిల్లలు పెద్దవాళ్లయ్యారు:

అయితే తాను సినిమాలు చేయకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి అని చెప్పాడు. కొన్ని చిత్రాలు నేను వదులుకున్నా. ఇంకొందరు నన్ను అవాయిడ్ చేశారు. ఒకప్పుడు ఎలాంటి చిత్రలైనా చేసి ఉండొచ్చు. కానీ నా పిల్లలు పెద్దవాళ్లయ్యారు. వాళ్లు సినిమాలు చూసేటప్పుడు ఇబ్బంది పడకూడదు. నేను వాళ్ల ముందు తల దించుకోకూడదు. సో అందుకే ఇక బూతూ ఉన్న చిత్రాలు చేయకూడదనుకున్నా. అందుకే నా దగ్గరకి వచ్చిన అలాంటి సినిమాల్ని వదులకున్నా.

తినడానికి టైం లేకుండా పని:

తినడానికి టైం లేకుండా పని:

అయితే ఆ చిత్రాలకు సంబంధించిన వాళ్లు వేరే వాళ్లకు ఇంకో రకంగా చెప్పారు. అందే విధంగా చాన్స్ లు ఇచ్చే వారు వెనక్కి వెళ్లిపోయారు. అయిన నేను హ్యాపీ. ఒకప్పుడు రేయింబవళ్లు పని చేశా. తినడానికి టైం లేకుండా పని చేశాను. రోజుకు ఆరు షిఫ్టులు పని చేసిన ఏకైక నటుడిని నేనేనేమో.

రీఎంట్రీ :

రీఎంట్రీ :

ఇప్పుడు కూడా చిత్రాలు ఎంచుకునే విషయంలో నేను పెట్టుకున్న నియమాలు దాటట్లేదు. పవన్ కళ్యాణ్ 'కాటమరాయుడు' సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్నా. పవన్ తో మరో సినిమా కూడా చేసే చాన్స్ కూడా ఉందని తెలిపాడు వేణుమాధవ్. మళ్ళీ పాత వేణూ మాధవ్ గా తన మార్కు కమేడీ తో ఆకట్టుకుంటాననే నమ్మకంతో ఉన్న వేణూ మళ్ళీ తన కెరీర్ ని సక్సెస్ఫుల్ గానే కొనసాగించాలని కోరుకుంటున్నారు అతని అభిమానులు

English summary
Recently in an interview, Venu Madhav said that he rejected a few movies and a few directors didn’t want him to act in their films. Comedian Venu Madhav wasn’t seen in as many movies as he usually used to appear in the past. Venu Madhav will be seen next in this much talked movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu