»   »  దిల్ రాజు నెక్ట్స్ సినిమా దర్శకుడు ఎవరంటే.....

దిల్ రాజు నెక్ట్స్ సినిమా దర్శకుడు ఎవరంటే.....

Posted By:
Subscribe to Filmibeat Telugu
Dil Raju
టాలెంటు ఉన్న యువ దర్శకులు (సుకుమార్,భాస్కర్,పైడిపల్లి వంశి,అడ్డాల శ్రీకాంత్ )ను ప్రోత్సహిస్తూ వరసగా హిట్స్ కొడుతున్న దిల్ రాజు తన తరువాత సినిమాను మరో కొత్త కుర్రాడుకు అప్పచెప్పనున్నారు. ప్రస్తుతం 'కొత్త బంగారు లోకం' సినిమాకు అసెస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తున్న వేణు శ్రీరామ్ కు ఆ అవకాశం దక్కింది. అతని లోని డెడికేషన్, రాత్రింబవళ్ళు పనిచేసే తీరు నచ్చే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన మీడియాకు చెప్పారు. ఇప్పటికే దిల్ రాజుకి అతనో కథ చెప్పినట్లు అది విని ఇంప్రెస్ అయిన ఈ నిర్ణయం తీసుకున్నారని సన్నిహితులు చెప్తున్నారు.అలాగే ఆయన వాసు వర్మ అనే మరో నూతన దర్శకుడు తో నాగార్జున కుమారుడు నాగచెతన్యను పరిచయం చేస్తున్నారు. అలాగే కొత్త బంగారు లోకం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కూడా గతంలో దిల్ రాజు బ్యానర్ లో అసెస్టెంట్ గా పనిచేసినవాడే కావటం విశేషం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X