»   »  చింతకాయల రవి లో వేణు?

చింతకాయల రవి లో వేణు?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Venu
అనూష్క,మమతా మోహన్ దాస్ కాంబినేషన్ లో యోగి రూపొందిస్తున్న 'చింతకాయల రవి' చిత్రంలో తొట్టం పూడి వేణు కూడా నటిస్తున్నాడని తెలుస్తోంది. అయితే గెస్ట్ హీరో గానా లేక కీలకమైన క్యారెక్టరా అన్నది తేలియాల్సి ఉంది. అందులోనూ పెద్ద హీరోల సినిమాల్లో ఇలా చిన్న హీరోలు ముఖ్య మైన పాత్రలో కనపడటం సహజమే కాబట్ట వేణు ఒప్పుకున్నాడని అంటున్నారు. వేణు కి దీపావళి,మాయగాడు సినిమాలు తప్ప మరేమీ లేవు. అవి కూడా క్రేజ్ అసలు లేని పరిస్ధితి .

దాంతో పెద్ద హీరోల ప్రక్క న అయితే మరికొంత చూసే అవకాశం ఉంటుందని సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినట్లువుతుందని సన్నిహితులు చెప్పారుట. అయినా వేణు 'హనుమాన్ జంక్షన్' వంటి ఇద్దరు హీరోలు ఉన్న సినిమాల్లోనే మూడో వాడుగా చేసాడు. దీంట్లో వింతేముంది అంటున్నారు సీనియర్లు .ఇక నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ కామిడీగా ఉంటుందని,వెంకటేష్ బాడీ లాంగ్వేజ్ కి అనుగుణంగా 'నువ్వు నాకు నచ్చావు' తరహాలో ఉంటుందని తెలుస్తోంది. అక్టోబర్ 2న గాంధీ జయింతి రోజు ఈ సినిమాను రిలీజ్ చెయ్యటానికి ప్లాన్ చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X